హుజూరాబాద్ ఎన్నికల మీద తెలంగాణా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఫోకస్ చేసింది. హుజూరాబాద్ లో అధికార పార్టీ అక్రమాలకూ పాల్పడుతుంది అని ఆ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన రాష్ట్ర బిజెపి బృందం... ఆ తర్వాత మీడియాతో మాట్లాడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసిన లక్ష్మణ్ , రామచంద్ర రావు బంగారు శృతి, ఆంటోనీ రెడ్డి... పలు ఫిర్యాదులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళారు.

హుజరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది అని బిజెపి నేత లక్ష్మణ్ ఆరోపించారు. అధికారం అడ్డుపెట్టుకొని అధికారుల ద్వారా ఉప ఎన్నికల్లో గెలవాలని చుస్తుంది అని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నది అని ఆరోపించారు. కుట్ర పూరితంగా ఉప ఎన్నికల్లో గెలవాలని టిఆర్ఎస్ పార్టీ చూస్తుంది అని విమర్శించారు. దళిత బంధు పథకాన్ని బిజెపి స్వాగతించింది దాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేసింది అని లక్ష్మణ్ ప్రస్తావించారు.

మిగతా అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశాము అని అన్నారు ఆయన. ఎన్నికల దృష్ట్యా దళిత బంధు ఆపాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చారుఅని వెల్లడించారు. బిజెపి బిజెపి వల్లనే రైతు బంధు పథకం కేంద్ర ఎన్నికల కమిషన్ అపిందింటూ  టిఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందిఅని ఆరోపించారు. అక్రమ డబ్బు ద్వారా ఎన్నికల్లో గెలవాలని టిఆర్ఎస్ పార్టీ చూస్తుంది అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో కూడిన ఉప ఎన్నిక... ఎన్నికల లబ్ధి కోసమే దళితబంధు తీసుకువచ్చింది అని వెల్లడించారు. కేంద్ర అధికారులను పంపి  ఎన్నికలు నిర్వహించాలని కోరాం అని వివరించారు. ఎన్నికల కమిషన్ అన్ని విషయాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చింది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts