జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. మా ఊళ్లోనే మా ప్రాంతంలోనే..పోలీసులు అండ‌గా నిలిచారు. ర‌క్ష‌ణ ఇచ్చారు. ఆ రోజు చంద్ర‌బాబు సీఎం గా ఉన్నారు. ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కు తావివ్వ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నడుచుకుని, జ‌గ‌న్ పాద‌యాత్ర కు ఎంత‌గానో స‌హ‌క‌రించింది. ఇవాళ టీడీపీ కార్యాల‌యాల‌పై చంద్ర‌బాబు పై భౌతిక‌, మాన‌సిక దాడులు ఏమంత మంచివి కావు. వీటిని మానుకుంటే మేలు.

- శ్రీ‌కాకుళం టీడీపీ నాయ‌కులుటీడీపీ పిలుపు ఇచ్చిన బంద్ పై వైసీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు చాలా చాలా అప్ర‌జాస్వామికంగా ఉంద‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ఇవాళ మా ప్రాంతంలో జ‌రిగాయి. మా ప్రాంతం అంటే మా శ్రీ‌కాకుళం అని అర్థం. బంద్ ప్ర‌భావం అటుంచితే ఉద‌యం నుంచి పోలీసుల హ‌డావుడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే తాము న‌డుచుకుంటున్నామ‌ని ఇందులో మ‌రో ఆలోచ‌న‌కు తావేలేద‌ని చెప్పి, ఎంపీ, ఎమ్మెల్యేల‌ను అరెస్టు చేసేట‌ప్పుడు కూడా క‌నీస విజ్ఞ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా, అనుచిత రీతిలో ప్ర‌వ‌ర్తించారు.

టీడీపీ బంద్ ప్ర‌భావం పూర్తిగా లేకుండా వైసీపీ చేసింది. ఈ విష‌య‌మై పోలీసుల‌ను బాగా వినియోగించుకుని త‌న పంతం నెగ్గించుకుంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ నాయ‌కుల‌పై పోలీసుల ప్ర‌వ‌ర్త‌న మాత్రం ఏమీ బాగాలేదు. ఎక్క‌డిక‌క్క‌డ వారిని నిలువ‌రించేందుకు చూపించిన అత్యుత్సాహం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. సీనియ‌ర్ల విష‌య‌మై క‌నీస గౌర‌వం ఇవ్వ‌కుండా పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించిన తీరు పై ఇప్ప‌టికే చాలా చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. మా ప్రాంతంలో రోడ్ల‌పైకి వ‌చ్చి టీడీపీ మ‌ద్ద‌తుదారులు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ త‌రుణంలో మా ప్రాంతంలో ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి.
అదేవిధంగా గృహ నిర్బంధాల పేరిట పోలీసులు చేసిన ఓవ‌ర్ యాక్ష‌న్ కూడా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ప్ర‌జా స్వామ్యంలో ఎవ‌రు అయినా రోడ్డెక్కి నిర‌స‌న‌లు చెప్పే అవ‌కాశం ఉన్నా  పోలీసులు ఎందుకు వైసీపీ ఏజెంట్లుగా ఉన్నార‌ని టీడీపీ నాయ‌కులంతా ఆవేద‌న చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: