ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాము ఉగ్రవాదులము కాదు అంటూ ప్రపంచ దేశాలను నమ్మించేందుకు ప్రయత్నిస్తూ ఆయుధాలను చేతపట్టి చివరికి ఎన్నో అరాచకాలు సృష్టించి ఆఫ్ఘనిస్థాన్ ను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు.  ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఎంతో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను మనుషుల్లా కాకుండా బానిసలుగా చూస్తూ రోజురోజుకు దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు అనుమతించడం లేదు.



 సాధారణంగా ఉగ్రవాదుల లక్ష్యం ఎంతటి మారణహోమం సృష్టించి అయినా సరే ఇస్లామిక్ రాజ్యం తీసుకురావడమే.. ఈ క్రమంలోనే  ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో  ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు ఇస్లామిక్ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఉగ్రవాదుల్లో ఒక వర్గం  తాలిబన్లకు అదే ఉగ్రవాదులు పెద్ద తలనొప్పిగా మారిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్లో ఐ ఎస్ ఐ ఎస్ కే తీవ్రవాదులు బాంబు దాడులకు పాల్పడుతూ ఉండటం సంచలనంగా మారిపోయింది. ఓవైపు తాలిబన్ల అరాచక పాలన  మరోవైపు ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని ప్రశ్నార్ధక  జీవితాన్ని గడుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.



 అయితే ఐ ఎస్ ఐ ఎస్ కే తీవ్రవాదులు చేసిన బాంబు పేలుళ్ళ పై స్పందించిన తాలిబన్లు తాము ఉగ్రవాదాన్ని అసలు సహించబోమని అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఐ ఎస్ ఐ ఎస్ కే  తీవ్రవాదుల అంతు తేలుస్తాం అంటూ పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండటం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో అటు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కూడా అధికారికంగా ఇటీవల ఒక ప్రకటన చేశారు. దమ్ముంటే తమని ఆపాలి అంటూ ఏకంగా చాలెంజ్ విసిరారు. దీంతో రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: