నిన్న‌టి వేళ ఇదే స‌మ‌యానికి రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. తీవ్ర ఘ‌ట‌న‌లు, ప్ర‌తిఘ‌ట‌న‌లు న‌డుమ ఇరు వ‌ర్గాలు మాట‌ల‌తో యుద్ధానికి సై అన్నాయి. ఓ వ‌ర్గం త‌న బ‌లం చూపించుకునేందుకు మ‌రో వ‌ర్గంపై దాడుల‌కు తెగ‌ప‌డ్డాయి. దీంతో పోలీసులు సీన్ లోకి రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ్డార‌ని  టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది.అయితే జ‌గ‌న్ వ‌ర్గం మాత్రం ఘ‌ట‌న‌కు సంబంధించి త‌మ త‌ప్పేం లేద‌ని చెప్పి మ‌ళ్లీ మ‌ళ్లీ చంద్ర‌బాబును లోకేశ్ ను తిట్టింది. ఇప్పుడు టీడీపీ బూతుల క‌న్నా వైసీపీ బూతులు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి..ఈ నేప‌థ్యంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగితే ఎవ‌రు బాధ్య‌త ? వీటిపై అమిత్ షా ఎందుక‌ని స్పందించడు? ఎవ‌రి ప్ర‌యోజ‌నం ఎంత‌?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి చంద్ర‌బాబు ఫోన్ చేశారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు అన్నీ చెప్పారు. మ‌రి! ఇన్నీ విన్నా అమిత్ షా ఏం చేశారు. ఏం చెప్పారు. మ‌రీ! చిన్న‌పిల్లాడికి చెప్పిన విధంగా చంద్ర‌బాబుకు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ముఖ్యంగా అమ‌రావ‌తి తెలుగుదేశం రాష్ట్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడికి సంబంధించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌మ‌ని చెప్పి, త‌ప్పుకున్నారు. ఆ త‌రువాత ఆయ‌న నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. ఇప్పుడు కేంద్రాన్ని న‌మ్ముకుని చంద్ర‌బాబు ఏం సాధించార‌ని? వాస్త‌వానికి వైసీపీ మ‌నుషుల దాడిని తాము ఎదుర్కొనేందుకు ఎన్న‌డూ సిద్ధం గా ఉన్నామ‌ని చెప్పే చంద్ర‌బాబు త‌న స్థాయిని హోదాని తెలిపే విధంగా అమిత్ షాకు ఫోన్ చేశారు.
ఆయ‌న కూడా ఫోన్ లిఫ్ట్ చేసి విష‌యం ఏంట‌న్న‌ది తెలుసుకుని ఓ మామూలు ఎస్సై హోదాలో స్పందించి ఫోన్ దించేశారు. ఇప్పుడు టీడీపీ డైలామాను తీర్చేదెవ‌రు? క‌ష్టంలో ఉన్న‌ప్పుడు, బాధ‌లో ఉన్న‌ప్పుడు స్నేహితుల అవ‌స‌రం అవుతారు. ఆ క్ర‌మంలో అమిత్ షాను న‌మ్ముకుని లాభం లేద‌ని పాత మిత్రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీన్ లోకి తెచ్చేందుకు మాజీ సీఎం సిద్ధం అవుతున్నారు. ప‌వ‌న్ ను సీన్ లోకి తెచ్చి బీజేపీని కూడా దార్లోకి తెచ్చుకోవ‌చ్చ‌న్న‌ది బాబు ప్లాన్. మ‌రి! ఈ ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా లేదా అన్న‌ది సంశ‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి: