అధికార వైసీపీ, ప్రతిపక్ష టి‌డి‌పిలు కలిసి రాష్ట్రాన్ని ఒక దారి చేసేలా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఏపీ చాలావరకు నష్టపోయింది. ఓ వైపు కేంద్రం సహకరించదు....మరో వైపు రాష్ట్రంలో ఉన్న నాయకులు సరైన పాలన అందించరు. ఫలితంగా దేశంలోనే ఏపీ వెనుకబడిన రాష్ట్రం మాదిరిగా తయారైపోయింది. ఐదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు...రాష్ట్రానికి గ్రాఫిక్స్‌లో బొమ్మ చూపించారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్...ఇంకా జనాలకు చుక్కలు చూపిస్తున్నారు.

అసలు ప్రజల గురించి వదిలేసి....వీరు రాజకీయ కక్షతో రగిలిపోతున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే కోపంతో...ప్రజలని బలి చేస్తున్నారు. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌, వైసీపీ నేతలపై ఎలాంటి మాటల దాడి చేశారో అందరికీ తెలిసిందే. అలాగే జగన్‌ని అనేక రకాలుగా అవమానించారు. అప్పుడు టి‌డి‌పి ఒకటి చేస్తే...మేము వంద చేస్తామన్నట్లుగా ఇప్పుడు వైసీపీ...టి‌డి‌పి నేతలకు చుక్కలు చూపిస్తుంది. వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా చంద్రబాబుపై బూతులతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుని అనేక రకాలుగా అవమానించారు. టి‌డి‌పి నేతలు, కార్యకర్తలపై కేసులు, జైల్లో పెట్టడం జరిగాయి.

అయితే టి‌డి‌పి నేతలు కూడా బూతులతో రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా టి‌డి‌పి నేత పట్టాభి...సి‌ఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి మాటలు ఏపీ రాజకీయాల్లో కామన్ అయిపోయాయి. ఇంతకంటే ఎక్కువగానే వైసీపీ నేతలు చంద్రబాబుని తిడుతూ వస్తున్నారు. కానీ వైసీపీ నేతలు ఆవేశానికి లోనై...టి‌డి‌పి కార్యాలయాలపై దాడి చేశారు.


ఇక దాడికి నిరసనగా చంద్రబాబు ఏమో రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. తమ నేతలని బూతులు మాట్లాడకుండా కంట్రోల్‌లో పెట్టకుండా పరిస్తితిని ఇంతవరకు తీసుకొచ్చారు. దీనికి ప్రతిగా జగన్ మాట్లాడుతూ....అసలు తమకు బూతులు తెలియవని, అలాంటి బూతులే వినలేదని అంటారు. వైసీపీ నేతలు మాట్లాడిన బూతులు జగన్ ఎప్పుడు వినలేదు అనుకుంటా...సరే జగన్ వినకపోతే మంచిది...పైగా టి‌డి‌పి నేతలు బూతులు తిట్టారని, తమ అభిమానులు బీపీ పెంచుకుని దాడులు చేశారన్నట్లుగా మాట్లాడేశారు. అంటే ఇక్కడ చంద్రబాబు, జగన్‌లు ఎవరి పర్ఫామెన్స్ వాళ్ళు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు కలిసి రాష్ట్రానికి చాలానే డ్యామేజ్ చేశారని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp