నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లెలా అనే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా క్లియర్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగో సింగిల్‌గా బరిలో దిగితే పావలా ఉపయోగం లేదని పవన్‌కు బాగా అర్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన...చంద్రబాబుతో కలిసి జగన్‌ని ఎదురుకోవడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అటు చంద్రబాబుకు కూడా జగన్‌ని సింగిల్‌గా ఎదురుకునే సత్తా లేదు. అందుకే బాబు కూడా పవన్ సపోర్ట్ కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇక వీరి స్నేహానికి ఈ మధ్య చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో కొన్ని మండలాల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి వైసీపీకి చెక్ పెట్టాయో...అప్పటినుంచి సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆ తర్వాత నుంచి పవన్...జగన్ ప్రభుత్వంపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు సైతం...పవన్‌ని తిట్టారు. ఇక అప్పుడే చంద్రబాబు, టి‌డి‌పి నేతలు పవన్‌కు సపోర్ట్‌గా నిలిచారు. పవన్‌ని తిట్టడం కరెక్ట్ కాదని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు.

 
ఇటు పవన్ కల్యాణ్ సైతం తాజాగా టి‌డి‌పికి మద్ధతుగా నిలబడ్డారు. వైసీపీ శ్రేణులు...టి‌డి‌పి ఆఫీసులపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇక దాడుల జరిగిన వెంటనే...పవన్ కల్యాణ్ స్పందిస్తూ...దాడులని ఖండించారు...దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, జగన్...తమ కార్యకర్తలని కంట్రోల్‌లో పెట్టుకోవాలన్నట్లుగా మాట్లాడారు. అయితే ఇక్కడ పవన్....టి‌డి‌పి నేత పట్టాభి, జగన్‌ని తిట్టిన విషయాన్ని వదిలేశారు. అంటే ఎలాగో వైసీపీ నేతలు తనని ఇష్టారాజ్యంగా తిట్టారు కాబట్టి, పట్టాభి తిట్లు పెద్ద లెక్క కాదని అనుకున్నట్లు ఉంది.

 
కానీ ఏది ఎలా జరిగినా...చంద్రబాబు-పవన్‌లు ఒకరిని ఒకరు బాగా సహకరించుకుంటున్నారని అర్ధమవుతుంది. అందుకే ఇలా వరుసపెట్టి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికి పవన్-చంద్రబాబులు కలిసే నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని ఢీకొట్టనున్నారని తెలుస్తోంది. అంటే పొత్తు విషయంలో పవన్ బాగా క్లియర్‌గా ఉన్నారని అర్ధమవుతుంది. మరి అధికారికంగా టి‌డి‌పి-జనసేనల పొత్తు ఎప్పుడూ ఖరారు అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: