ఏంటో ఈ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. సీఎంగా ఉన్న జగన్ కంటే వైసీపీ ఎమ్మెల్యేలే నెగిటివ్ గా హైలైట్ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు కావొస్తుంది....మరి ఈ రెండున్నర ఏళ్లలోనే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అర్ధమవుతుంది. ఇప్పటికే పలు సర్వేల్లో అదే విషయం తేలింది. సీఎంగా జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి గానీ, కొందరు ఎమ్మెల్యేలకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వారిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలింది.

అయితే లోకల్ సర్వేలే కాదు...నేషనల్ సర్వేలు సైతం దేశంలో ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటుంది ఏపీ ఎమ్మెల్యేలే అని తేల్చి చెబుతున్నాయి. తాజాగా సీ-ఓటర్ సర్వే అదే విషయాన్ని తేల్చింది. దాదాపు 28 శాతంపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని ఆ సర్వే చెప్పింది. దేశంలో ఏపీ ఎమ్మెల్యేలే ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో టాప్‌లో ఉన్నారని వివరించింది.


అంటే 175 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు పైనే వ్యతిరేకత ఉందని అర్ధమవుతుంది. అయితే 175 మంది ఎమ్మెల్యేల్లో వైసీపీకి 151 మంది ఉన్నారు...అలాగే టి‌డి‌పి-జనసేనల నుంచి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలని కలుపుకుంటే 156 మంది ఉన్నారు. ఇక టి‌డి‌పికి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒకవేళ టి‌డి‌పిలో 10 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని అనుకున్నా...దాదాపు 50 మంది వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని చెప్పొచ్చు.

 
ఇక రెండున్నర ఏళ్లకే పరిస్తితి ఇలా ఉంటే...మరో రెండున్నర ఏళ్లకు పరిస్తితి ఎలా ఉంటుందో అర్ధం కాకుండా ఉంది. మళ్ళీ ఈ ఎమ్మెల్యేలని జగన్ బరిలోకి దింపితే వైసీపీకే డ్యామేజ్...కాబట్టి అలాంటి ఎమ్మెల్యేలని పక్కనబెట్టాల్సిన అవసరముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: