మానుకోటలో ఫ్లెక్సీల వివాదం చిలికి చిలికి గాలివానగా ఎందుకు మారింది..? ఉర్సు రంగలీల మైదానం వేదికగా తూర్పు నియోజకవర్గ పెద్దల మధ్య అభిప్రాయభేదాలు ఎందుకు వచ్చాయి..?  ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు అంతగా ఎందుకు ముదురుతున్నాయి..? వరంగల్ లో వివిధ ద్విదాశబ్ది ఉత్సవ సభ వచ్చే నెలలో నిర్వహించనున్న వేళ నేతల మధ్య కొరవడిన సమన్వయం సభ నిర్వహణకు సమస్యగా మారబోతుందా..? మహబూబాబాద్లో ఎంపి వర్సెస్ ఎమ్మెల్యే గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరగా తూర్పు లో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశ మైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని  నేతల ఆధిపత్య పోరు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ఇబ్బందిగా మారింది.

 సద్దుల బతుకమ్మ వేడుక సాక్షిగా  మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆదిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకరు, నిలువరించేందుకు మరొకరు ఇలా ఇరువర్గాల మధ్య హై వోల్టేజ్ పాలిటిక్స్ రన్ అవుతున్నాయి. మానుకోటలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎంపీ కవిత వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శంకర్ నాయక్ అనుచరులు చించేశారు. దీనిపై కవిత అనుచరులు పోలీసులకు  ఫిర్యాదు చేయడం, మున్సిపల్ వైస్ చైర్మన్  తో సహాపలువురి పై కేసులు పెట్టడం, అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. మానుకోట లో జరిగిన ఘటన పై ఎంపీ కవిత మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇద్దరు నేతలను అధిష్టానం తీవ్రంగా మందలించిందట. ఇక వరంగల్ తూర్పులో  ప్రత్యక్ష పోరు కంటే పరోక్ష పోరే ఎక్కువగా ఉంది. ఇక్కడ జరుగుతున్న రాజకీయంపై ప్రజల్లో హాట్ హాట్గా చర్చలు జరుగుతున్నాయి. తూర్పు లో దసరా సందర్భంగా జరిగిన రావణ వధ కార్యక్రమంలో  ఎమ్మెల్యే నరేందర్ అంతా తానై వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లి తో మాట్లాడించిన తర్వాత మరో నేత తో మాట్లాడించక పోవడంతో స్టేజి పై ఉన్న ప్రజాప్రతినిధులు అంతా అసంతృప్తిగా ఫీలయ్యారు. అయితే స్టేజి మీద మేయర్ గుండు సుధారాణి కూడా ఉండడం తన నియోజకవర్గంలో ఆమె ఆధిపత్యానికి అవకాశం ఇవ్వకుండా నరేందర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తూర్పు లో గత ఆరు నెలలుగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే కోల్డ్ వార్ నడుస్తోంది. మేయర్ కు అవకాశం ఇవ్వకుండా ఆమె కూడా ఎమ్మెల్యే అనుచరులై న కార్పొరేటర్లకు ప్రియారిటి ఇవ్వకుండా ఒకరికొకరు వ్యక్తిగత ద్వేషాలతో పైకి నవ్వుకుంటూ కనిపించినా అంతర్గత పోరుతో కార్పొరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ నుంచి అవసరమైన సహకారం తీసుకుంటారు కానీ ఆమెకు ప్రాధాన్యత కల్పించకపోవడమెంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఆధిపత్య పోరుతో అటు కార్యకర్తలు, ఇటు అధికారులు నలిగిపోతున్నారన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: