దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కువగా వారి వేతనాల గురించిన అంశాలు చర్చకు దారితీస్తుంటాయి. అయితే పెద్దగా చర్చకు రాని అంశాల్లో గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి. మరీ ముఖ్యంగా తాత్కాలిక కార్మికులు గా కొనసాగుతున్న మహిళలకు ఆయా కంపెనీలు చేసిన వాగ్దానాలు ఉత్తిగానే  మిగిలిపోయాయి. కనీస అవసరాలైన బాత్రూంలు లేవు. భద్రతా లేదు. అధికారిక గుర్తింపు లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉంటే అటు ప్రభుత్వము కానీ ఇటు ఆయా సంస్థలు కానీ దీనిపై దృష్టి సారించడం లేదు. దీంతో గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి.

 స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థలో కొనసాగుతున్న గిగ్ కార్మికులు గత నెలలో సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించాడు. తమకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు అసంగటిత కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యలను సైతం కల్పించాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు. ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్ 2017 ఆన్లైన్ లేబర్ ఇండెక్స్ ప్రకారం ఆన్లైన్ కార్మిక సరఫరాలో భారత్ అగ్రభాగాన్ని ఆక్రమించి.. ప్రపంచ గిగ్ వర్కర్ల వాటాలో24 శాతాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం యాప్ ఆధారిత వ్యవస్థ, పేలవమైన పని పరిస్థితులు, సామాజిక భద్రత ప్రయోజనాలు లేకపోవడం, చట్టబద్ధంగా వారికి ఉద్యోగి హోదా కల్పించడంలో వైఫల్యాలు వంటివి గిగ్ కార్మికులకు అతిపెద్ద అడ్డంకులుగా ఏర్పడ్డాయి. మహిళలు లింగ ఆధారిత అసమానతలు సైతం ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ లో జొమాటో తన సంస్థలో మహిళా కార్మికులను 0.5 నుంచి 10 శాతానికి పెంచాలనే యోచనను వెల్లడించింది. అలాగే మహిళలకు సంబందించిన భద్రత, సంబంధిత వస్తువులు అందించడం, మరుగుదొడ్ల ప్రాప్యతను పెంచడం, నెలసరి లో సెలవులు, వీక్ఆఫ్ లు, ప్రోత్సాహకాలు వంటి గురించి ప్రస్తావించింది. స్విగ్గి సైతం ఇలాంటి తరహా ప్రకటననే తన బ్లాగ్ లో పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: