కరోనా టీకాల పంపిణీలో భారత్ ప్రపంచ దేశాల్లో ముందుంది. తాజాగా దేశంలో టీకాల పంపిణీ 100కోట్ల డోసులకు చేరువైంది. అయితే రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 30శాతం మంది మాత్రమే రెండు డోసులు టీకా తీసుకోగా.. 70శాతానికి పైగా మంది ఒక్క డోసు మాత్రమే తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు చైనా మాత్రం తమ జనాభాలో 75శాతం మందికి రెండు డోసుల టీకా అందించింది.

భారత్ లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. వైరస్ వ్యాపతిని సూచించే r వాల్యూ సెప్టెంబర్ 4 నుంచి 1లోపే ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో  r వాల్యూను చెన్నైకి చెందిన మ్యాథమెటికల్ సైన్సెస్ ఇన్సిస్టిట్యూట్ లెక్కగట్టింది. చెన్నై,పుణె, ముంబైలో ఈ వాల్యూ 1లోపు ఉండగా.. బెంగళూరు, కోల్ కతాలో ఒకటి కంటే అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ నగరాల్లో r వ్యాల్యూ తగ్గించేందుకు వ్యాక్సినేషన్ పెంచాలని సూచించింది.

గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 14వేల 623కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 41లక్షల 8వేల 996కు చేరింది. తాజాగా కొవిడ్ కు 197మంది బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య4లక్షల 52వేల 651కి చేరింది. మరోవైపు 19వేల 446 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం లక్షా 78వేల 98 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 99కోట్ల 12లక్షల 82వేల 283వందల కోవిడ్ వ్యాక్సిస్ డోసులు వేశారు.

ఇక ఏపీలో కొత్తగా 523మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20లక్షల 61వేల 810కు చేరింది. మహమ్మారి ధాటికి మరో ముగ్గురు చనిపోగా.. మరణాల సంఖ్య 14వేల 320కు పెరిగింది. కొవిడ్ నుంచి కొత్తగా 608మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 20లక్షల 41వేల 924కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5వేల 566యాక్టివ్ కేసులున్నాయి.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. కొత్తగా 191 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6లక్షల 69వేల 556కు చేరింది. కరోనా ధాటికి మరొకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3వేల 942కు పెరిగింది. కొత్తగా 162మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 6లక్షల 61వేల 646కు చేరింది. అటు రాష్ట్రవ్యాప్తంగా 3వేల 968యాక్టివ్ కేసులున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: