దాడుల‌కు, ప్ర‌తి దాడుల‌కూ అన్నింటికీ ఓ లెక్క ఉంటుంది అని అంటున్నారు లోకేశ్. ఆయ‌న కూడా ఇప్పుడు చాలా యాక్టివ్ అయి టీడీపీ వాయిస్ లో కొత్త‌ద‌నం తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో కార్య‌క‌ర్త‌ల‌కు ఏ క‌ష్టం వచ్చినా తానున్నాన‌ని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ రాజ‌ధాని ప‌రిణామాలు మాత్రం శ‌ర‌వేగంగా మారిపోతుండ‌డమే ఆశ్చ‌ర్య‌క‌రం. గ‌తం క‌న్నా ఇప్పుడు చిత్రం అయిన ప‌రిణామాలు నెల‌కొంటున్నాయి. జ‌గ‌న్ త‌న వేగం కూడా పెంచారు. తిడితే తిట్టించుకోవ‌డం అన్న‌ది కాదు కానీ భౌతిక దాడులే వీరికి స‌బ‌బు అన్న త‌ర‌హాలో త‌మ ప్ర‌తికారేచ్ఛ‌ను చ‌విచూపుతున్నాయి వైసీపీ వ‌ర్గాలు.ఇక‌పై ఇంకా క్షేత్ర స్థాయిలో నిర‌స‌న‌ల‌కు దిగుతామ‌ని, త‌మనెవ్వ‌రూ ఆప‌లేర‌ని టీడీపీ అంటోంది. దాడులు ఎన్ని జ‌రిగినా భ‌య‌ప‌డేదే లేద‌ని చంద్ర‌బాబు చెబుతూనే, మ‌రోవైపు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక వీటిపై కేంద్రం ఆరా తీసింది. జ‌గ‌న్ స‌ర్కారు ఇప్ప‌టికే తాను చెప్పాల్సిందేదో చెప్పింది. ఇవి ఏ మేర‌కు ఫ‌లిస్తాయో? ఇక దాడుల్లో ఎవ‌రి చేయి తెర వెనుక ఉందో కూడా త‌న‌కు తెలియ‌దు అని జ‌గ‌న్ తేల్చేశారోచ్!


ఇంకా చెప్పాలంటే.......:
ఏపీలో చిత్ర విచిత్ర రాజ‌కీయాలు నెల‌కొంటున్నాయి. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకోవ‌డం వ‌ర‌కూ నిన్న‌టిదాకా ప‌రిమితం అయితే ఇప్పుడు భౌతిక దాడుల‌కు సైతం  వెనుక‌డుగు వేయ‌క పోవ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితులు ఉద్రిక్త‌త‌ల‌కు తావిస్తున్నాయి. అ యినా కూడా ఏ ప‌క్షం కూడా త‌గ్గ‌డం లేదు. గ‌తంలో జ‌గ‌న్ మాట్లాడిన మాట‌ల‌ను బూతుల‌ను టీడీపీ రీ ప్లే చేస్తోంది. ఇప్పుడు ప ట్టాభి మాట‌ల‌ను వైసీపీ రీ ప్లే చేస్తోంది. ఎవ‌రికి చెందిన ఛానెళ్లు వారికి ఉండ‌డంతో మీడియాకు ఫుల్ మీల్స్ అందిపోతోంది. దీంతో గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌కు తావిచ్చేందుకు అవ‌కాశం ఉన్న ఇలాంటి ప‌రిణామాల‌ను మీడియా అస్స‌లు వ‌దులుకోదు. అవ‌స‌రం ఉ న్నా,లేకున్నా బాగానే మాట్లాడించాల‌న్న త‌ప‌న ఒక‌టి టీవీ నైన్, ఏబీఎన్, సాక్షి లాంటి ఛానెళ్ల‌కు బాగా ఎక్కువ ఉంది. త‌ప్పేం కాదు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల సిద్ధికి, త‌మ యాజ‌మాన్యాల నిర్దేశం అనుసారం ఇవి న‌డుస్తుండ‌డం. ఇప్పుడు తాజాగా వినిపిస్తో న్న మాట ఏంటంటే ప‌ట్టాభి ఇంటిపై కానీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యంతో ఇత‌ర టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల‌లో జ‌గ‌న్ ప్ర‌మేయం లేనేలేద‌ని చెబుతున్నాయి వైసీపీ వ‌ర్గాలు. అవ‌న్నీ భావోద్వేగంలో భాగ‌మ‌ని, కోపంలో భాగ‌మ‌ని చెబుతున్నాయి. వీ టిని ఎలా అర్థం చేసుకోవాలి?  

మరింత సమాచారం తెలుసుకోండి: