రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహారంలో ఇది సరిగ్గా నిజమవుతోంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తికి... ఇప్పుడు కష్టాలు వెంటపడుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షానికే పరిమితమైంది. అది కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని మరి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ ఖాతాలో ఉన్నారు. వారిలో నలుగురు ఇప్పటికే వైసీపీకి మద్దతుగా నిలిచారు. రెండున్నర ఏళ్లుగా అధికార పార్టీ వేధింపులు కూడా ఎక్కువగా ఉండటంతో... చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు... పార్టీకి అండగా ఉండే నాయకులను తమ వైపు తిప్పుకుని.... ప్రభుత్వానికి సవాల్ విసిరాలనేది చంద్రబాబు స్కెచ్.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహంపై కూడా దాడి జరగడాన్ని చంద్రబాబు తప్పుబడుతున్నారు. అలాగే బాలకృష్ణ ఇల్లు, కార్యాలయంపై కూడా నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ విషయంపై నందమూరి కుటుంబ సభ్యులతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో.... తన అవసరం వచ్చినప్పుడు తప్పని సరిగా రంగంలోకి దిగుతానంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసేలే.... 36 గంటల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే నిరసన దీక్షకు మద్దతు తెలపాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. తామంతా ఒకటే అనే మాటనను ఇప్పటికే నందమూరి కుటుంబ అభిమానులుగా ఉన్న వైసీపీ నేతలకు కూడా తెలిసేనా చేయాలనేది చంద్రబాబు స్కెచ్‌లా ఉంది. అదే సమయంలో పార్టీకి ఎన్టీఆర్ నాయకత్వం కావాలంటూ కొంతమంది నేతలు చేస్తున్న డిమాండ్ కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. మరి జూనియర్ వస్తాడో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: