హుజూరాబాద్ ఉపఎన్నిక.. తెలంగాణలోనే అత్యంత కీలకమైన ఉప ఎన్నిక.. మూడు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని సూచించే ఎన్నిక.. ఎలాగైనా పట్టునిలుపుకోవాలని అధికార టీఆర్ఎస్.. రాజకీయ భవితవ్యానికి చావోరేవోగా మారిన ఎన్నికల్లో పోరాడుతున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌.. పరువు పోగొట్టుకోకూడదని రంగంలో దిగిన కాంగ్రెస్.. ఇలా మూడు పార్టీలకూ ఇది కీలకమైన ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఈ అంశంపై అంతటా ఉత్కంఠ నెలకొన్న వేళ... సీ ఓటర్ సర్వే పేరుతో ఓ సర్వే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.


సర్వే హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధిస్తారని చెబుతోంది. మొత్తం ఐదు మండలాల్లో 1100 మందిని సర్వే చేసి ఈ ఫలితాలు రూపొందించినట్టు ఆ సంస్థ చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ కథనం సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంతన్నది మాత్రం నిర్థరణ కాలేదు. అయితే హుజూరాబాద్‌ ఫలితంపై ఓటర్లలో నెలకొన్న ఉత్కంఠ  కారణంగా ఈ కథనం ఆసక్తికరంగా మారింది.


ఈ సర్వేలో 49.4 శాతం మంది ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. అలాగే.. టీఆర్ఎస్‌ వైపు 34.12 శాతం మొగ్గుచూపుతున్నారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. ఇక కాంగ్రెస్ వైపు 16.49 శాతం మంది మొగ్గు చూపుతున్నారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది. జమ్మికుంట, హూజూరాబాద్, వీణవంక, కమలాపూర్‌, ఇల్లందకుంట మండలాల్లో ఈ సర్వే నిర్వహించారని ఈ సోషల్ మీడియా కథనం చెబుతోంది.


ఇప్పుడు ఈ సర్వే ఫలితాన్ని బీజేపీ వర్గాలు జోరుగా సోషల్ మీడియాలో తిప్పుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలు ఎన్నో వస్తుంటాయని.. వాటిలో ఏది వాస్తవమో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ఆయా సంస్థల అసలు వెబ్‌ సైట్లలోకి వెళ్లి ఈ సర్వేల గురించి చెక్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఏదైమైనా అసలు ఫలితం మాత్రం నవంబర్ 2 న రాబోతుంది. అప్పుడు తేలుతుంది అసలు హుజూరాబాద్ విజేత ఎవరో..? అప్పటి వరకూ ఇలాంటి సర్వేల షికార్లు, పుకార్లు తప్పదు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: