రాజకీయాల్లో ఒక్కసారి పదవి చేపడితే చాలు తరం మొత్తం బతికే అంత సంపాదిస్తరు అని అంటుంటారు. కానీ అది పెద్ద పెద్ద లీడర్లకయితేనే సాధ్యమవుతుంది కానీ చిన్న చిన్న లీడర్లకు కాదు.  చిన్న చిన్న లీడర్లు ఆస్తులు అమ్ముకున్న వాళ్లను కూడా మనం ఎంతో మందిని చూశాం. ఇంచుమించు అలాంటి విషయమే ఇది. నిజామాబాద్ జిల్లా మాట్లురు మండలం  బొంకన్ పల్లి ఊరి సర్పంచ్ తోట పద్మ. నిజామాబాద్ జిల్లాలో పది సంవత్సరాలుగా ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసింది. రాజకీయాల మీద ఆసక్తితో, ఊరిని డెవలప్ చేయాలనే కోరికతోనే సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిందట. గెలిచిన నాటినుండి నర్స్ గా పనిచేయడం బందు పెట్టి 20 లక్షల రూపాయలతో ని ఊరిలో అన్ని రకాల పనులు చేయించి అందరితో శభాష్ అనిపించుకుంది.

పద్మ పనితనం మెచ్చి శిశు సంక్షేమ శాఖ అధికారులు అవార్డు సైతం ఇచ్చారట. మొదట అప్పులు తెచ్చి ఊరిని డెవలప్ చేసిందంట కానీ, కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త కి అనారోగ్యంతో  మంచాన పడడంతో  చేసిన పనులకు బిల్లులు రాక, కట్టే అప్పులు ఎక్కువయ్యి   ప్రొద్దున సర్పంచ్ పనిచేసి, సాయంత్రం ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తుందట. వైకుంఠధామం, డంపింగ్ యార్డులను 12 లక్షల రూపాయలతోని కడితే  8 లక్షలు మాత్రమే వచ్చాయట . ఇంట్లో అవసరాల కోసం  తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ నర్సు గా పని చేస్తుందట. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే బిల్లులు రాక మళ్లీ జాబ్ చేస్తుందని గ్రామ ప్రజలు కూడా అంటున్నారు.

ఈ సర్పంచ్ ఒక్కతే కాదు ఇలా చాలా మంది సర్పంచులు  బిల్లులు రాక చాలా అవస్థలు పడుతున్నారు. ఇంతకుముందు డబ్బులు లేక ఇబ్బందితో సర్పంచ్ హమాలీ పని చేస్తున్నాడని, ఇంకొక దగ్గర ఉపాధి హామీ పని చేస్తున్నాడని తెలుసుకున్నాం. ఇంకా బయటపడని సర్పంచులు చాలా మందే ఉన్నారు. దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందించి సర్పంచులకు త్వరగా బిల్లులు ఇప్పించాలనివారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: