అధికారంలో ఉన్న‌ప్పుడు ఆ రోజు చంద్ర‌బాబు చేసిన త‌ప్పులను దృష్టిలో ఉంచుకుని ఇవాళ జ‌గ‌న్ స్పందిస్తున్నారు. వాటిపై ప్ర‌తికారం ఒక‌టి తీర్చుకోవాల‌ని ముందే అనుకున్న రీతిలో ప్ర‌ణాళికను అమ‌లు చేస్తున్నారు. అప్పుడు చంద్ర‌బాబు త‌మ‌ను మాట్లాడ‌నివ్వ‌లేద‌ని, అసెంబ్లీ సాక్షిగా చాలా మంది త‌న‌ను అవ‌మానించార‌ని, అదే పంథాను ఇప్పుడు తాను కొన‌సాగిస్తాన‌ని జ‌గ‌న్ పైకి చెప్ప‌క‌పోయినా చెబుతున్నట్లుగానే ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆశించిన రీతిలో అభివృద్ధి చేయాల‌న్న ఆలోచ‌న నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుని కేవ‌లం ఒక‌రిపై ఒక‌రు తిట్టుకునేందుకే విలువైన కాలాన్ని వెచ్చిస్తున్నారు. ఆ రోజు జ‌రిగిన ప‌రిణామాల‌న్నింటినీ దృష్టిలో ఉంచుకుని, అప్ప‌టిలానే తామూ వ్య‌వ‌హ‌రించి, టీడీపీ పై త‌మ అధికారం చూపాల‌న్న ఆతృత ఒక‌టి వైసీపీలో స్ప‌ష్టంగా ఉంటోంది. ఇదే అనేక త‌ప్పుల‌కు కార‌ణం అవుతోంది.

రాష్ట్రం విడిపోయాక మంచి నాయ‌క‌త్వం కావాల‌న్న తలంపుతో టీడీపీని ఎన్నుకున్నారు ప్ర‌జ‌లు. ఆ రోజు చంద్ర‌బాబు మొదలుకుని మిగ‌తా నాయ‌కులంతా ప్ర‌జ‌ల ఆమోదం పొందారు. మెప్పు పొందారు. అదేవిధంగా టీడీపీ నాయ‌కులకు అండ‌గా అన్ని చోట్ల ప్ర‌జ‌లు నిలిచారు. త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో అసెంబ్లీ సాక్షిగా అనేక ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.  ఆ రోజు జ‌గ‌న్ ను టార్గెట్ చేసుకుని చంద్ర‌బాబు మ‌నుషులు అసెంబ్లీలో అనేకానేక రీతుల్లో అనేకానేక మాట‌లు వినిపించారు. అదేవిధంగా తెలుగుదే శం మంత్రులు చంద్ర‌బాబు ఆజ్ఞ‌ల‌తో అస్స‌లు జ‌గ‌న్ ను మాట్లాడ‌నివ్వ‌క స‌భ‌ను ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించేలా మార్చేశారు.


ఇదే స‌మ యంలో వైసీపీ కూడా ఎదురు దాటికి దిగి త‌న పంతం నెగ్గించుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే రోజా కూడా అ నుచిత వ్యాఖ్యలు చాలానే చేశారు. ఇవ‌న్నీ ఆ రోజు జ‌రిగిన ప‌రిణామాల‌కు సంకేతంగా నిలిచి,  మొత్తం ప్ర‌జా స్వామ్య వ్య‌వ‌స్థ‌నే ని వ్వెర ప‌రిచాయి. ఇప్పుడు సీన్ మారింది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. వ‌చ్చిన నాటి నుంచి త‌న స‌త్తా చాటేందుకు ప్ర‌యత్నిస్తు న్నారు. పంతం నిలుపుకునే ప‌నులేవో చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: