ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ టీడీపీ తమ ముఖాలు కనిపించే విధంగా ఒక ప్రయత్నం చేశాయి. ఎప్పుడు కేవలం ప్రచారానికి తప్ప దేనికీ పనికిరాని రాజకీయాలు చేసే బాబోరు మరోసారి అదే పద్దతిని ప్రదర్శించారు. కేంద్ర నేతలు ఎవరైనా తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు అంటే చాలు వెంటనే బాబోరు వస్తారు, అంతలో గొడవలు, దాడులు ఇవన్నీ జరిగిపోతాయి. ఇవన్నీ ఎవరు చేస్తారో మరి, అంత పెద్ద నాయకుడు వచ్చేశాడని, కేంద్ర మంత్రిపై ఆయన దాడి చేస్తాడేమో అని ఆయనను నిలువరించాలని ప్రభుత్వం ఈ దాడులు, అరెస్టులు చేసినట్టే ఈ ప్రచారం సాగింది. ఎక్కడ చూసినా మీడియాలో ఇవే వార్తలు. అంతా బాబొరి సైన్యం ముఖాలు తప్ప ఇంకేమి టీవిలో కనిపించలేదు.

మొత్తానికి కేంద్రమంత్రి వస్తున్నాడని బలే ప్రచార నాటకం ఆడింది టీడీపీ. ఆయన వస్తున్నాడనే ఈ యాగీ చేసి, ఆంధ్రలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేకపోతుంది అనే మచ్చ తెచ్చి, రాష్ట్రప్రజలలో కూడా జగన్ పై ఉన్న అభిమానాన్ని కాస్తైనా తగ్గించాలని ఈ కుతంత్రం. ఇన్నేళ్ల రాజకీయాలలో బాబోరు నేర్చుకున్నది ఇదే రాజకీయాలు. అందుకే ఎక్కడ అయినా, ఎప్పుడైనా ఇదే తరహా నాటకాలు తప్ప, ప్రజలకు పనికి వచ్చే ఒక్కపని లేదు, ఉండబోదు. ఇది ఆయన తరహా రాజకీయాలు, ఆయన మారడు, మారె వాళ్ళని మారనీయడు. ఈసారి గెలవపోతే మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ ఉండనివ్వదనే ఉద్దేశ్యం టోన్ ఇవన్నీ ప్రణాళికలు పన్ని కాస్తైనా టీడీపీ పరువు నిలబెట్టాలని అనుకుంటూ, ఇంకాస్త దిగజారుస్తూనే ఉన్నాడు.

ప్రజలు హర్షించే పని ఒక్కటి తన పూర్తి రాజకీయ జీవితంలో చేయలేని నేతగా బాబోరు చరిత్రలోకి ఎక్కుతారేమో అంటున్నారు విశ్లేషకులు. ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో అవకాశాలు ప్రజలు ఇచ్చినప్పటికీ, వాటిని స్వప్రయోజనాలకు తప్ప ప్రజాప్రయోజనాలకు వాడని నేతగా బాబోరు మిగిలిపోతున్నారు. అధికార దాహం తప్ప మరొకటి లేదు. కేవలం ఆయనకు అధికారం ఇవ్వలేదని, ప్రజాప్రయోజనకరమైన ఎన్నో పధకాలు మూడో వ్యక్తులతో కేసులు వేసి మరి ఆలపించిన ఘనుడు బాబోరు. ప్రచారం తో గెలిచే రోజులు పోయాయని మరోసారి రాబోయే ఎన్నికలలో టీడీపీ తెలుసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: