ప్ర‌జాస్వామ్య రాజ్యంలో అంద‌రూ ఉండాలి. అందరూ మాట్లాడ‌క పోయినా కొంద‌ర‌యినా ప్ర‌జ‌ల గొంతుక వినిపింప‌జేయాలి. హ‌క్కుల కోసం పోరాడాలి. ఒక‌నాడు జ‌గ‌న్ ఇదేవిధంగా మాట్లాడి, జ‌నంలోకి వెళ్లి, ఓదార్పు యాత్ర‌లు చేసి క్రేజ్ పెంచుకున్నారు. అదేవిధంగా జనం మ‌ధ్య‌న ఉంటూ వారి క‌ష్టాలు తెలుసుకుని నాయ‌కుడిగా స్పందిం చారు. టీడీపీపై పోరు స్వ‌రం వినిపించి అప్ప‌ట్లో అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకున్నారు. ఈ క్ర‌మంలో  సంయ‌మ‌నం కోల్పోయి అప్ప‌టి విప‌క్ష నేత అయిన జ‌గ‌న్ కొన్ని
అనుచిత వ్యాఖ్య‌లు కూడా చేశారు. కానీ అవ‌న్నీ మ‌రిచిపోయి తెలుగుదేశం నేత‌లు మాట్లాడ‌డ‌మే త‌ప్పు అన్న విధంగా జ‌గ‌న్ స్పందిస్తున్నారు.

విప‌క్షంలో ఉన్నంత కాలం జ‌గ‌న్ త‌న‌దైన దీక్ష‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగించారు. ఎక్కడా ఆయ‌న త‌గ్గ‌కుండా చంద్ర‌బాబుపై పై చేయి సాధించి, ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఆ రోజు స‌మ‌స్య‌ల‌పై స్పందించిన తీరు కార‌ణంగానే నాలుగు ఓట్లు ఎక్కువ‌గా వైసీపీకి ప‌డ్డాయి. అదేవి ధంగా దీక్ష‌ల స‌మ‌యంలో అధికార పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడిన తీరు ఒక‌టి ప్ర‌జ‌లను ఆక‌ర్షించింది. తాను అధికారంలోకి వ స్తే ఏం చేస్తానో చెప్పి, అధికార పార్టీ టీడీపీని ఇర‌కాటంలో పెట్టారు జ‌గ‌న్. అంతేకాదు పాద‌యాత్ర‌లో కూడా అధికార పార్టీపై నిప్పు లు చిమ్మారు. ఓ విధంగా చెప్పాలంటే పాద‌యాత్ర సాఫీగా సాగిందంటే అందుకు కార‌ణం అప్ప‌టి ప్ర‌భుత్వ‌మే! అన్న‌ది ఒప్పుకోక త‌ప్ప‌ని నిజం. అటుపై జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. 151 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని శాస‌న స‌భ‌లో అడుగు పెట్టారు.


అప్ప‌టి నుంచి జ‌గ‌న్ త‌న‌దైన పంథాలో విప‌క్షాన్ని అణిచి వేస్తున్నార‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. ఏ చిన్న ధ‌ర్నాకు పిలుపు ఇచ్చినా పోలీసుల‌తో వాటిని చెద‌ర‌గొట్టించి, నాయ‌కుల‌ను అరెస్టు చేయించి అస‌లు నిర‌స‌న‌లే లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై టీడీపీ చేసిన నిర‌స‌నల‌న్నింటినీ పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. ఎక్క‌డికక్క‌డ గృహ నిర్బంధంలో ఇరుక్కుపోయారు. అయినా కూడా టీడీపీ కొన్ని చోట్ల నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌గ‌లిగింది. నిర‌స‌న పేరెత్తితేనే జ‌గ‌న్ హ‌డ‌లెత్తిపో తున్నారు. టీడీపీ నాయ‌కుల‌ను అరెస్టు చేయించి, వెంట వెంట‌నే వారిని వేర్వేరు పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లించేలా ఏర్పాట్లుచేసి, అస‌లు విప‌క్షం గొంతు అన్న‌ది వినిపించ‌నీయ‌క చేస్తున్నారన్న ఆరోప‌ణ ఒక‌టి వైసీపీపై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp