ఏపీలో మరోసారి విపక్షాలు ప్రభుత్వాన్ని సజావుగా జరగకుండా ఆపేందుకు అవే పాత నాటకాలు మళ్ళీ తెరపైకి తెచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనిపించినా లేదా ఎప్పడు కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాల సందర్శన చేస్తున్నారని తెలిసినా ఇలాంటి రాజకీయాలు టీడీపీ తీవ్రంగా చేస్తుంది. తమమీద ప్రభుత్వమే దాడులు నెరపుతున్నట్టుగా పరిస్థితులను రూపొందించి మరీ ఈ తరహా బాగోతాలు తెరపైకి తెస్తుంది. ఇలాంటివి టీడీపీ చరిత్రలో లెక్కలేనన్ని ఉంటాయని ఎవరికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు, కానీ కేవలం జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సమయంలోనే ఈ శాతం ఖచ్చితంగా తీవ్రంగా ఉందని స్పష్టంగా చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు. కేవలం తమ ముఖాలు ఎవరూ పట్టించుకోవడంలేదని ఒక్క కారణాన నిత్యం పబ్లిసిటీ స్టంట్ లు చేస్తూ పబ్బం గడుపుకుంటుంది ఆ పార్టీ.

ఇలాంటివి చేయడం ద్వారా ప్రభుత్వం పై లేనిపోని ఒత్తిడి తప్ప మరో ప్రయోజనం ఉండబోదు. అసలే కరోనా, ఇతర సమస్యలతో ఎవరికి వారు సమతమైపోతున్నప్పుడు, అలాగే మరోపక్క ఉపఎన్నిక పనులలో అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్ లు చేసి టీడీపీ వారందరి పనిని అనవసరంగా చెడగొడుతుంది తప్ప మరొక్కటి లేదు. ఇలా అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు, మరోవైపు ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే పనికిమాలిన రాజకీయాలు టీడీపీ చరిత్రలో మాత్రమే చూడగలం. ఇంత దిగజారిపోయినా పరవాలేదు, ప్రజలలో జగన్ కు ఇసుమంత వ్యతిరేకత వస్తే చాలు అనేంత కింది స్థాయి ఆలోచనలు చేసే స్థాయిలో బాబోరు ఉండిపోయారు అంటే ఇంకా చెప్పడానికి ఏమి  మిగుతుంది.

కొందరికి చెప్పినా వినరు, వాళ్ళ పంధానే అలా ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం టీడీపీ అధినేత. ఒక్క సరైన ప్రభుత్వాన్ని తనపని తాను చేసుకోనివ్వకుండా ప్రతిదానికి అడ్డుపడుతూ, ప్రజల నోటికాడి కూడును కూడా లాగేసుకుంటున్న నేతగా ఆయన మిగిలిపోవా తప్ప మరొకటి ఇక్కడ ఏమి మిగలదు. ఇప్పటికే ఆయనను పక్కన పెట్టాలని అనుకుంటున్నప్పటికీ, ఈసారి ఎన్నికల వరకు కూడా కనీసం ఆయనను భరించక తప్పదని ఆ పార్టీ వారే అనుకుంటున్నప్పుడే ఆయన పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: