ఆంధ్రాలో ఉపఎన్నిక కోసం టీడీపీ స్టంట్ లు చేస్తుంది. కనీసం అప్పుడైనా కాసిన్ని ఓట్లు రాలేకపోతాయా అనేది దాని ఆశ. టీడీపీ కి ఇలాంటివి చేయడం లో పెట్టింది పేరు. అంత ఘన చరిత్ర కూడా ఎవరికి ఉండదు. అయితే రాష్ట్రంలో గతఎన్నికలలో ఓటమి పాలైనప్పటి నుండి ఇప్పటి వరకు చేసినవి అన్ని ఒక ఎత్తు గా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవడైనా అధికారం లోకి వచ్చి ప్రజా సేవ చేస్తాడు. బాబొరి చరిత్రలో అదంటే కూడా ఏమి తెలియదు. కానీ వచ్చిన ప్రభుత్వం అవన్నీ చేస్తుంటే, ఎక్కడ ఇక తనని ప్రజలు డెకరేమో అనే మానసిక అసౌకర్యంతో లేనిపోని స్టంట్ లు అసలు లెక్కలేవు అన్ని చేసేశారు, చేస్తూనే ఉన్నారు. ప్రజలకు కూడా పధకాలు దక్కకుండా చేసిన ఏకైన నేతగా ఈయన పేరుగాంచాడని చరిత్రలో లిఖించవచ్చు. అది ఈయన ఇటీవల చేసిన ఘనమైన పనులు.

తాజాగా ఉపఎన్నిక సంబర్భంగా కూడా ఓటమి తథ్యం అని ఎలాగూ తెలుసు అయినా ఏదో ఒక యాగీ చేసి ప్రభుత్వంపై ఏదైనా మచ్చ తెచ్చే పని చేయాలన్నది టీడీపీ వ్యూహం. ఎన్ని చేసినా ఫలితంచం మాత్రం లేదు. అయితే గితే  టీడీపీ పార్టీ ఇంకాస్త దిగజారిపోవడం తప్ప మరొకటి కనిపించడం లేదు. ఇకనైనా దిగిపోవయ్యా అని టీడీపీ వర్గాలు బాబొరికి దండాలు పెట్టి వేడుకుంటున్నా ఈ ఒక్కసారికి అని అందరికి కాళ్ళమీద పడి వేడుకున్నట్టే ఉంది ప్రస్తుతం ఆయన చేసే పనులు చూస్తుంటే. ఇవన్నీ చూసి జాలిపడో మరొకటో అనుకుని ప్రజలు ఓటు వేస్తె ఏమి జరిగిద్దో వాళ్లకు తెలుసు. ఇవన్నీ ఓట్లు రాల్చవు అని టీడీపీకి తెలుసు, అయినా ఏదో ఒకటి చేసి ముందు మీడియా ద్రుష్టి వారిపైకి తెచ్చుకోవాలి.  

అప్పుడప్పుడైనా టీవీలలో కనిపించకపోతే అసలు ఆ పార్టీ ఉన్నట్టే అందరు మరిచిపోతారేమో అనేది ఆయన భావన. అందుకే ఏదో ఒక యాగీ చేస్తూనే ఉంటాడు. పార్టీ పగ్గాలు నీచమైన పరిస్థితులలో తీసుకున్నవాడు, ఇలాంటివి చేయడానికి సిగ్గు పడతాడా ఏమిటి. అది ఆయన ఇన్నేళ్ల అనుభవం, రాజకీయం, ప్రజాసేవ, ఇవన్నీ చూపించి ఓట్లు అడిగితే వేసేవాడు పిచ్చోడు అనిపించుకోవాల్సిందే తప్ప మరొకటి ఉండబోదు.

మరింత సమాచారం తెలుసుకోండి: