పాద‌యాత్ర చేసిన వైఎస్ కానీ రేపు చేయాల‌నుకుంటున్న చంద్ర‌బాబు కానీ న‌డిచేది, న‌డిపించేది ఓటు బ్యాంకు రాజ‌కీయ‌మే.. ఇందుకు త‌గ్గ వ్యూహాల‌తోనే వీరంతా కాలం వెచ్చిస్తున్నారు అన్న‌ది ఓ వాస్త‌వం.

రెండంటే రెండు సామాజిక‌వ‌ర్గాలు రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నాయి. అవే ఓటు బ్యాంకు రాజ‌కీయాలు న‌డుపుతూ త‌మ ప‌ని తాము చేసుకుని పోతున్నాయి. మ‌రో పార్టీకి అవ‌కాశం లేకుండా రాజ‌కీయాలు చేస్తున్న ఆ రెండు పార్టీలు ఇక‌పై మ‌రిన్ని వ్యూహాలు అమ‌లు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. కులాల వారీగా మ‌నుషుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం ఎప్ప‌టి నుంచో ఉన్నా, కులాల‌పై ప్ర‌భావం చూపేలా రాజ‌కీయాలు ఏనాటి నుంచో ఉన్నా అవేవీ త‌రువాత కాలంలో నిలదొక్కుకోలేదు. ఇప్పుడు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు కూడా కులాల వారీగా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగ‌మే.

సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల‌ను బ‌లోపేతం చేసే విధంగానే ప‌ద‌వులు, నిధుల కేటాయింపులూ ఆ ఇద్ద‌రూ చేశారు. చేస్తున్నారు కూడా! ఇదెంత మాత్రం భావ్యం కాదు. అయిన‌ప్ప‌టికీ త‌మ ప‌ద‌వుల కోసం, అధికారం కోసం ఎవ‌రి ఉనికిని వాడు కాపాడుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలివి. కాపు, కాళింగ‌, వెల‌మ సామాజిక‌వ‌ర్గాలు ఉత్త‌రాంధ్ర‌లో పాల‌క వ‌ర్గాలుగా ఉన్నాయి. అందుకే వాటికి అనుగుణంగా ప‌ద‌వుల కేటాయింపు ఉంది. ఇదే విధంగా మిగ‌తా ప్రాంతాల‌లో కూడా క్యాస్ట్ ఈక్వేష‌న్లు ఉన్నాయి. మంచి నేత‌లు అనిపించుకుని తీరాల‌న్న త‌ప‌న ఒక్క‌టే వీరిని ఉచిత ప‌థ‌కాల వైపు అడుగులు వేయిస్తున్నాయి.

ఇదే త‌రుణంలో ఇదే నేప‌థ్యంలో..:
ఓ సామాజిక‌వ‌ర్గం ప్ర‌తినిధిగా చంద్ర‌బాబు ఉన్నారు అని అనుకోలేం. అదేవిధంగా జ‌గ‌న్ నూ గుర్తించ‌లేం. కొన్ని త‌ప్పులున్నా కూ డా కొన్ని విష‌యాల్లో ఎవ‌రికి వారే స‌మ‌ర్థులు. ఓ మారు మూల ప‌ల్లె నుంచి ఎదిగివ‌చ్చిన లీడ‌ర్ చంద్ర‌బాబు.  రాజ‌కీయంలో అం చెలంచెలుగా ఎదిగిన నేత. బ‌ల‌మయిన సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యం ఉన్నా కూడా! రాజ‌కీయంలో నిల‌దొక్కుకునేందుకు ఇవాళ్టికీ అవ స్థ‌లు పడుతున్న  నేత. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రంను ప‌రిపాలించి, కొన్ని మంచి ప‌నులు చేసిన నేత. రాష్ట్రం విడిపోయాక ఐదేళ్ల పాటు సీఎం హోదాలో రాజ‌ధాని నిర్మాణం మొద‌లుకుని ఇంకొన్ని ప‌నుల‌కు శ్రీ‌కారం దిద్దిన నేత‌. అధికారుల‌లో ఒక‌ప్ప‌టిలా అ సంతృప్తి రాకుండా నిన్న‌మొన్న‌టి వేళ సీఎంగా త‌న‌దైన శైలిలో ప‌నిచేయించిన నేత. ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే తండ్రి చ‌నిపోయి న త‌రువాత రాజ‌కీయంలో చురుగ్గా పాల్గొన్న నేత. ఒక‌నాటి వైఎస్ పేరును నిల‌బెట్టాల‌న్న ఆకాంక్ష‌తో ఉన్న నేత. ఈ విధంగా ఇ ద్ద‌రూ మంచి నేత‌లుగా పేరున్న వారే అయిన‌ప్ప‌టికీ .. కొన్ని ఓటు బ్యాంకు రాజ‌కీయాలను ప్ర‌భావితం చేస్తూ త‌మ‌ని తాము త గ్గించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp