"నాయ‌కుల‌ను మీరు తిట్టండి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు..అరెస్టులు చేయ‌డం అల‌వాటుగా చేసుకోండి ఎవ్వ‌రూ గ‌మ‌నించ‌రు" అని మాత్రం అనుకోకండి. వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న నిర్బంధ కాండ కార‌ణంగా రాష్ట్రంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్ర‌బాబుకే సానుభూతి వ‌స్తోంది.


పాల‌న ఎలా ఉన్నా మ‌నుషులను ప‌ట్టించుకోని పాల‌న పాల‌నే కాదు. అధికారం ఎలా ఉన్నా సామాన్యుల వెత‌ల‌ను తీర్చ‌ని  అధికా రం అధికార‌మే కాదు. ప‌ట్టాభి ప్ర‌శ్నించినా లేదా ఇంకొక‌రు ప్ర‌శ్నించినా ఈ రాష్ట్రం బాగుండాలి అన్న‌ది ఓ ఆవేద‌న కావొచ్చు. ఈ స‌మ యంలో వారు హ‌ద్దులు దాటి మాట్లాడ‌వ‌చ్చు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా కూడా ఓ ముఖ్య‌మంత్రిని అన‌రాని మాట‌లు అన‌డం నేర‌మే! దీనిని ఎవ్వ‌రూ కాద‌నరు కానీ విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న వాటిపై, మ‌న్యంలో సాగ‌వుతున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాల ని కోరుకోవ‌డం కూడా త‌ప్పు కాదు. టీడీపీ పై నోరేసుకుని ప‌డిపోయే జ‌గ‌న్ మంత్రులు కూడా ఒక్క‌టి ఆలోచించాలి. తాము తిడుతు న్నాం అంటే ఏం కోల్పోతున్నామో అన్న‌ది కూడా అర్థం చేసుకుని తీరాలి. అవ‌త‌లి వారు త‌ప్పు చేసినా కూడా సంయ‌మ‌నం పాటించాలి. కానీ ఇక్క‌డ అలా లేదు. వారెంతో వీరూ అంత అన్న విధంగా అధికార, అన‌ధికార వ‌ర్గాలు తిట్టిపోసుకుంటున్నాయి.



ఇవెలా ఉన్నా, ప‌రిణామాల న‌డ‌క ఎలా ఉన్నా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం జ‌నాల్లో టీడీపీ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. తిట్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం స‌రిక‌దా! అవి విని న‌వ్వుకుంటున్న వారే ఎక్కువ. మా రోజుల్లో ఇలా లేదు ఇలా కాదు అని ఒక త‌రం గుర్తుకు తెచ్చుకుంటే, అప్పుడూ ఇలాంటివే ఉన్నాయ‌ని ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ లోజ‌రిగిన ఒక‌నాటి ప‌రిణామాల‌ను త‌ల్చుకుంటున్నారు ఇంకొంద‌రు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ త‌న వైఖ‌రి కార‌ణంగా టీడీపీకి భారీ స్థాయిలో ఊహించ‌ని రీతిలో ఇమేజ్ క‌ట్ట‌బెట్టారు. జ‌నం కూడా జ‌గ‌న్ విష‌య‌మై సానుకూలంగా లేరు. ల‌క్ష కోట్ల సంక్షేమ ప‌థ‌కాలు తాము అడిగామా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. విశాఖ కేంద్రంగా జ‌రిగే అన్యాయాల‌ను అక్ర‌మాల‌ను ప‌ట్టాభి అనేకాదు తాము కూడా అడ్డుక‌ట్ట వేయ‌మ‌నే కోరుతున్నామ‌ని, అందుకు సీఆర్పీసీ నోటీసులు ఇస్తారా అని ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. జ‌గ‌న్ ను ద‌గ్గ‌రుండి న‌డిపించి గెలిపించిన పార్టీయే టీడీపీ అని కొంద‌రు అంటున్నారు. కాల క్ర‌మంలో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింద‌ని, ఏపీ సీఎం అణిచివేత‌ల కార‌ణంగా టీడీపీకి మంచి పేరు వ‌చ్చింద‌ని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: