మద్యం ఆరోగ్యానికి హానికరం.. అని అటు అధికారులు జనాలందరికీ కూడా అవగాహన కల్పించేందుకు ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంతే కాదు సినిమా థియేటర్లలో కూడా ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.  అంతేకాదండోయ్ ప్రతి ఒక్కరికి మద్యం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం స్పష్టంగా తెలుసు. కానీ ఎవరు కూడా మద్యానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించరు. రోజురోజుకీ మద్యానికి దగ్గరవుతూ మద్యానికి బానిసగా మారిపోతున్నారూ తప్ప  దూరంగా ఉండడానికి ఒక్కరు కూడా సాహసం చేయడం లేదు.


 ఇలా మద్యానికి బానిస గా మారడం కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా వచ్చింది. అంతే కాదు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. ఇలా మద్యం నేటి రోజుల్లో ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారిన వారిని మార్చేందుకు కొంతమంది వినూత్నంగా ప్రయత్నించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటిదే చేశారు ఇక్కడ.  మద్యం తాగితే ఇక వారిని రాత్రంతా బోనులోకి పంపిస్తారు.



 గుజరాత్ లో ఇలా చేయడం మొదలుపెట్టారు నాట్ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు.  మద్యానికి బానిసైన వారిని మార్చేందుకు వినూత్నమైన ఆలోచన చేశారు. మద్యం తాగితే వాళ్లని బోనులో నిర్బంధించారు.  ఇలా ఎన్ని రోజుల పాటు మద్యం తాగితే అన్ని రోజులు ఇక బోనులో ఉండాల్సిందే. అహ్మదాబాద్ జిల్లాలోని మోతి పుర గ్రామానికి చెందిన నాట్ వర్గానికి చెందిన పెద్దలు 2019 సంవత్సరంలో ఈ తీర్మానం చేశారు. అప్పటినుంచి  మందుబాబులు అందరికీ కూడా ఇలాంటి శిక్ష విధిస్తూ వస్తున్నారూ. ఇక మందు బాబులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం కూడా ఉంటుంది . ఇక మందు తాగిన వారిని గుర్తించి రాత్రంతా బోనులోకి పంపిస్తారు. కేవలం మంచినీళ్లు మాత్రమే ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఇటీవల కాలంలో గృహహింస కేసులు తగ్గాయి అంటూ చెబుతున్నారు ఈ వర్గానికి చెందిన పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి: