జ‌గ‌న్ చాలా ఓపిక ప‌ట్టాడు. జ‌గ‌న్ త‌న‌ను తిట్టిన వారందిరినీ గుర్తు పెట్టుకున్నాడు. ప‌గ మ‌రియు ప్ర‌తికారంలో భాగంగా కొన్ని ప‌నులు చేసి త‌న ఇగోను సంతృప్తం చేసుకున్నాడు కూడా! ఇదే సంద‌ర్భంలో పాద‌యాత్ర‌కు వ‌చ్చిన‌ప్పుడు మా ప్రాంతానికి వ‌చ్చాడు. మా ప్రాంతం అంటే శ్రీ‌కాకుళం జిల్లాకు.. వంశ‌ధార ఫేజ్ 2 ప‌నులు తానే పూర్తి చేయిస్తాన‌ని అన్నాడు. తోట‌ప‌ల్లి కాలువ ప‌నుల మ‌ర‌మ్మ‌తుల‌కే నిధులు ఆచితూచి ఇచ్చాడు. ఇక ఒడిశాతో ఉన్న వివాదాలు తేల్చేస్తాన‌ని అన్నాడు. ఇవాళ్టికీ నేరడి బ్యారేజీ నిర్మాణానికి దిక్కేలేదు. న్యాయ ప‌ర‌మైన ఇబ్బందులపై మాట్లాడేందుకు ఒడిశా సీఎంతో చ‌ర్చ‌కు  తాను సిద్ధం అని ఇప్ప‌టిదాకా చెప్ప‌నే లేదు. ఆ రోజు వెనుక బ‌డిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పి మ‌రిచే పోయారు.


ఉత్త‌రాంధ్ర‌పై ప్రేమ అంతా బుగ్గిపాలేనా! పోనీ పేద‌ల‌కు ఇళ్లిస్తాన‌ని చెప్పారు ఆ సంగ‌తేమైంది. మీరు స్థ‌లం ఇచ్చినా ఇక్క‌డ ఇల్లు క‌ట్టుకునే వారెవ్వ‌రూ లేరు స‌ర్ .. ఎందుకంటే భ‌వ‌న నిర్మాణ సామాగ్రి ధ‌ర‌లు అలా ఉన్నాయి మ‌రి! ఇక మా ఊరికి వ‌చ్చిన‌ప్పుడు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న కోడిరామ్మూర్తి స్టేడియం ప‌నులలో వేగం లేద‌ని తానొచ్చాక వాటిని పూర్తి చేయిస్తాన‌ని అన్నారు. దీనిని కూడా మ‌రిచిపోయారు క‌దండి.. మీ ఇష్టం మీ రాజ్యం ఇది. ఎవ్వ‌రు ప్ర‌శ్నించినా వారికి జైలే గ‌తి!



పాద‌యాత్ర‌లో భాగంగా త‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రు వ‌చ్చినా మాట్లాడాడు జ‌గ‌న్. ఓదార్పు యాత్ర‌లో భాగంగా త‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రు వ‌చ్చి నా వారి స‌మ‌స్య‌లు విన్నాడు జ‌గ‌న్. పెద్ద పెద్ద ధ‌న‌వంతుల కుటుంబాల నుంచి వ‌చ్చి ఎండ‌కు ఎండి, వాన‌కు త‌డిసి ఇలాంటి క‌ష్టా లు ఎన్నింటినో త‌ట్టుకుని జ‌గ‌న్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలో బ‌న్నీ మాదిరిగా పేరు తెచ్చుకున్నాడు. విలువులే ఆస్తి అన్నా డు. జ‌గ‌న్ అను నేను అని ప‌లికే వ‌ర‌కూ నిద్ర పోను అన్నాడు. అటుపై మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమా మాదిరిగా జ‌నం గుర్తింపు పొందాడు. కార్పొరేట్ రాజ‌కీయాల‌కు త‌న‌దైన  వ‌న్నె తీసుకువ‌చ్చాడు. ప్ర‌శాంత్ కిశోర్ నేతృత్వంలో న‌డిచి సీఎం అయ్యాడు. క‌ల నెర‌వేర్చుకున్నాడు. అప్పుడు పాద‌యాత్ర‌లో చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌పై కూడా స‌భ‌ల్లో అడ్ర‌స్ చేసి చెప్పాడు. స్థానిక స‌మ‌స్య‌ల ప‌రి ష్కారానికి  త‌ను అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాను అని అన్నాడు. ప్రాజెక్టుల నిర్వాసితుల‌పై ప్ర‌త్యేక ప్రేమ కురిపించాడు. అదేవిధంగా ప్ర‌త్యేక హోదా పై గ‌ర్జించాడు. విశాఖ కేంద్రంగా ప్ర‌త్యేక రైల్వే జోన్ తీసుకు వ‌స్తాన‌ని కూడా చెప్పాడు.ముఖ్యం అనుకు న్న వెయ్యి హామీలు ముఖ్య‌మంత్రి అయ్యాక మ‌రిచే పోయాడు. అందుకు నిధులలేమినే ప్ర‌ధాన కార‌ణం అంటూ చెప్పుకుంటూ వ‌స్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp