టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, వివాద ర‌హిత నేత ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఏం చేస్తున్నారు?  ఎక్క‌డున్నారు? అనంత పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌ర్గంలో ఇప్పుడు ఇదే ప్ర‌శ్న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగా.. రాజ‌కీయాల్లో ఉన్న ర‌ఘునాథ‌రెడ్డి.. 2009, 2014 ఎన్నిక‌ల్లో పుట్ట‌ప‌ర్తి నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో మంత్రిప‌ద‌ని కూడా అలంక‌రించారు. అయితే.. గ‌త ఎన్నిక‌లకు ముందు నుంచి ఆయ‌న పోటీకి దూరంగా ఉండాల‌ని భావించారు. అయిన‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల‌లో చంద్ర‌బాబు ఆయ‌న‌కే టికెట్ ఇచ్చారు. ఇక‌, వైసీపీ సునామీ నేప‌థ్యంలో ప‌ల్లె ప‌రాజ‌యం పాల‌య్యారు.

మ‌రి ఇప్పుడు ఏం చేస్తున్నారు?  ఇప్ప‌టికేరెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న యాక్టివ్ అయ్యారా?  లేక‌.. ఏం జ‌రుగుతోంది..? అంటే.. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఊసు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మాట కూడా వినిపించ‌డం లేదు. చంద్ర‌బాబు అంటే ఎంతో విధేయ‌త చూపించే ప‌ల్లె.. పార్టీలో చురుగ్గా వ్య‌వ‌హ‌రించార‌నే పేరుంది. అంతేకాదు.. త‌నను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించినా.. ఆయ‌న నొచ్చుకోకుండా.. పార్టీకి ఎంతో కృషి చేశారు.

అయితే.. ఇప్పుడు ఉన్న రాజ‌కీయాల్లో తాను త‌ట్టుకోలేకపోతున్నాన‌ని కొన్నాళ్లుగా ఆయ‌న చంద్ర‌బాబుకు చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని.. కూడా చంద్ర‌బాబును కోరుతున్నారు. వివాద ర‌హితుడు.. పార్టీ కోసం ప‌నిచేసిన నాయ‌కుడు కావ‌డంతో ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపేందుకు అభ్యంత‌రం లేదు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుపైనే ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. లేదా.,. పార్టీకి వ‌చ్చే సీట్ల‌పైనే ఇది ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం కొంత వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. నియోజ‌వ‌క‌ర్గంలోనూ యాక్టివ్‌గా లేర‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఓటు బ్యాంకు మాత్రం అలానే ఉంద‌ని.. ఎవ‌రు ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. ప‌ల్లె ఓటు బ్యాంకు టీడీపీకే ప‌డుతుంద‌ని చెబ‌తుఉన్నారు. మ‌రి చంద్ర‌బాబు ఆయ‌న‌కే మ‌ళ్లీ టికెట్ ఇస్తారో.. లేక రాజ్య‌స‌భ‌కు పంపేలా చూస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP