టీడీపీ కార్యకర్తలని భయ భ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేసారు. ప్రజలు ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే అని ఆయన స్పష్టం చేసారు. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించ లేదు అని అన్నారు ఆయన. దీంతో గవర్నరుకు ఫిర్యాదు చేశాం అని వివరించారు. టీడీపీ నేతలను చంపేందుకు.. నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని ఆయన వివరించారు.

అమిత్ షా కు ఫోన్ చేసి.. ప్రభుత్వం-పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారని వివరించాను అని అన్నారు చంద్రబాబు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరాను అని తెలిపారు. ప్రభుత్వానికి చేత కాకుంటే పోలీస్ వ్యవస్థను మూసేసి ఇంటికెళ్లండి అని హోం మంత్రికి.. డీజీపీకి సిగ్గనిపించడం లేదా..? అంటూ ఘాటుగా స్పందించారు. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని అన్నారు  చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి ఏం చేయాలో మాకు తెలుసు అని అన్నారు చంద్రబాబు. ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి అని ఆరోపించారు.

లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆర్టికల్ 356 పెడతారు అని ఎప్పుడూ ఆర్టికల్ 356ను సమర్ధించని పార్టీ.. దాని గురించి మాట్లాడుతోంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు చంద్రబాబు. మా పర్మిషన్ లేకుండా పోలీస్ అధికారి మా కార్యాలయానికి ఎందుకొచ్చారు..? అని చంద్రబాబు నిలదీశారు. డీజీపీ ఇంటికో.. ఆఫీసుకో పర్మిషన్ లేకుండా వస్తే ఊరుకుంటారా..? అని అంటూ మండిపడ్డారు. ఈ డీజీపీ కొత్త సంస్కృతికి తెర లేపారు అని ఆయన విమర్శించారు. హ్యాట్సాఫ్ డీజీపీ.. శభాష్ డీజీపీ అన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి అని అన్నారు ఆయన. పొరుగు రాష్ట్రం డీజీపీ ఏపీలో గంజాయి సాగు జరుగుతోందంటూ ప్రకటనలిచ్చారు అని వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం తన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సమీక్ష పెట్టారు అని అన్నారు. నేతల భాషపై బహిరంగ చర్చకు సిద్దమా..? అంటూ  చంద్రబాబు  సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: