వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మంత్రి, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా నాలుగోసారి విజ‌యం ద‌క్కించుకున్న కొడాలి నానిపై వ్య‌తిరేక‌త వ‌స్తోందా? ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం పెరుగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీలో ఉన్న‌ప్పుడు.. ఇక్క‌డి ప్ర‌జ‌లు గెలిపించారు. వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌కూడా గెలిపించారు. కానీ, త‌మ‌కు చేసింది ఏంటి? అనేది ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇక్క‌డ ఏ ఒక్క ర‌హ‌దారి కూడా స‌రిగా లేదు. పోనీ.. అభివృద్ధి అయినా.. ఉందా.. అది కూడాలేదు. అంతేకాదు.. సాక్షాత్తూ మంత్రి ఇంటికి దారి తీసే ర‌హ‌దారి కూడా స‌రిగా లేక‌పోవ‌డం.. గ‌మ‌నార్హం.

ఇవే విష‌యాల‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రెండున్న‌రేళ్లు మంత్రిగా ఉండి.. నియోజ‌క వ‌ర్గానికి చేసింది ఏంటి?  రేపో.. మాపో.. మంత్రిగా అధికారం కూడా పోతోంది. అప్పుడు ఏం చేస్తారు? అంటూ.. స్థానిక మ‌హిళ ఒక‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టిన ఘ‌ట‌న‌.. వైర‌ల్ అయింది. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా కిక్కురుమ‌న‌లేదు. వాస్త‌వానికి నానిని కానీ.. జ‌గ‌న్‌ను కానీ.. ఎవ‌రైనా ఏమైనా .. అంటే వెంట‌నే స్పందించే నాని వ‌ర్గం నేత‌లు.. సైతం ఈ విష‌యంపై నోరు విప్ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో చాలాఏళ్లుగా ఇలాంటి స‌మ‌స్య‌లే ఉండ‌డం.. మంత్రి ప‌ట్టించుకోక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా మారింది. వాస్త‌వానికి.. మంత్రి కొడాలికి తిరుగులేని.. ఓటు బ్యాంకు ఉంది. ఆయ‌న‌ను అభిమానించే వారుసైతం ఎక్కువమందే ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరే ఆయ‌న‌కు మైన‌స్‌గా మారుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు గ‌తంలో మాదిరిగా చూసీ చూడ‌న‌ట్టు వెళ్లిపోవ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గం ర‌హ‌దా రులు, తాగునీరు.. ఇళ్ల ప‌ట్టాలు.. మురుగునీటి పారుద‌ల ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు ఎత్తి చూపుతు న్నారు.

ఈ క్ర‌మంలో మంత్రి కొడాలికి.. స్థానిక స‌మ‌స్య‌లే..పెద్ద మైన‌స్‌గా మారుతున్నాయ‌ని.. అంటున్నా రు ప‌రిశీల‌కులు. మంత్రి నానిపై ప్ర‌త్యేకంగా వ్య‌తిరేక‌త రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. స్థానిక ప్ర‌జ‌ల్లో క‌నుక తిరుగుబాటు వ‌స్తే.. దీనిని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి నాని ఏం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: