విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణ లో వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణ వీర మరణం పొందిన అమర వీరులను ఘన నివాళి అర్పిస్తున్న అన్నారు ఆయన. దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలు మరచి పోలేము అని హోం మంత్రి పేర్కొన్నారు. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారు అని కీర్తించారు. 377 మంది పోలీసులు విధి నిర్వహణ లో అమరులైయ్యారు అని ఆయన పేర్కొన్నారు.

విధి నిర్వహణ లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని స్పష్టం చేసారు. కరోనా క్లిష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్రం లో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన ప్రస్తావించారు. ఇందులో 10 మంది హోమ్ గార్డులు చనిపోయారు అని హోం మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. కరోనా సమయంలో చనిపోయిన పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది అని స్పష్టం చేసారు. ఉగ్రదాడి జరగకుండా, తీవ్ర వాదం లేకుండా పోలీసులు తమ విధులను ఎంతో శ్రద్దగా నిర్వహిస్తున్నారు అన్నారు.

సీసీటీవీ లు ఏర్పాటు చేసి నేరాలకు తగ్గించే కార్యక్రమం చేపట్టారు అని వివరించారు. నూతన పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసాము అన్న హోం మంత్రి మహిళల భద్రత కు భరోసా సెంటర్ల ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నాము అని తెలిపారు. గడిచిన ఏడేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేసింది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించాము అన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటించారు అలీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts