మత రాజకీయాలు చేస్తుంది, దేశభక్తి పేరు చెప్పి ఓట్లు సాధిస్తుంది. ఇదే ఇన్నాళ్లు బీజేపీ మీద ఉన్న అపప్రద విపక్షాల ఆరోపణ. అయితే ఇప్పుడు ఆ మార్కు క్లియర్ చేసేలా అసలు అభివృద్ధి అంటే ఏమిటో కళ్లకు చూపించేలా కీలక అడుగులు వేస్తోంది మోడీ ప్రభుత్వం. కోటి కోట్లతో  కొత్త భారత్ నిర్మిద్దామని పిలుపునిచ్చిన ప్రధాని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నుంచి ఇంటర్నెట్  సదుపాయం వరకు , విద్య నుంచి వైద్యం వరకు సంస్కరణలు తీసుకొచ్చి సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. 60 సూత్రాల తో ముందుకచ్చిన కేంద్రం కీలక మార్పులు తీసుకురాబోతోంది. సిటిజన్ షిప్ ఇష్యు, పర్యావరణ విధానాలు, మైనింగ్ వ్యవహారం, పేదలకు విద్య లాంటి చాలా అంశాలు ఈ 60 సూత్రాల ప్రణాళికలో చర్చించారు. నిజానికి ఒక దేశ అభివృద్ధి విద్య,వైద్యం తో పాటు పారిశ్రామికీకరణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కేంద్రం. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు నవభారత్ అన్న కలను నిజం చేసేలా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగానూ కలిసి వచ్చేలా కీలక అడుగులు పడుతున్నాయి.

 ఇప్పుడిప్పుడే ఎకానమీ కోలుకుంటుంది. రకరకాల టాక్స్ ల రూపంలో కేంద్రానికి రెవెన్యూ పెరుగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భారీగా ఇన్వెస్ట్మెంట్ లు వస్తున్నాయి. దీనివల్ల కొత్తగా ఎంప్లాయిమెంట్ జనరేట్ కావడంతో పాటూ ప్రభుత్వానికి టాక్స్ రెవెన్యూ పెంచుతుంది. సేవా రంగంలో తిరుగులేని గ్రోత్ నమోదవుతుంది. ఇలాంటి తరుణంలో ఈ 60 కొత్త  సూత్రాలతో తీసుకొచ్చిన ప్రణాళిక దేశ ఆర్థిక వ్యవస్థను మరో కొత్త మార్గం లోకి తీసుకెళుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. స్టార్టప్ లకు వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలన్నది కేంద్రం మరో ఆలోచన. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే బిజెపి దూకుడును ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా ఎవరూ కనీసం టచ్ కూడా చేయలేరు. నిర్ణయాలు తీసుకోవడం కాదు అమలు మీద దృష్టి సారించినప్పుడే అది సాధ్యమౌతుంది. మోడీ 3.0 లో  భాగంగానే ఈ కొత్త చిత్రాన్ని మనం చూస్తునమన్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: