వ‌చ్చే ఎన్నిక ల‌లో గుంటూరు జిల్లాలో టీడీపీ టిక్కెట్ల కోసం ఇప్ప‌టి నుంచే గ‌ట్టి పోటీ నెల‌కొంది. జిల్లా లో గుంటూరు తో పాటు న‌ర‌సారావు పేట తో పాటు బాప‌ట్ల పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో బాప‌ట్ల పార్ల‌మెంటు స్థానం గుంటూరు జిల్లా తో పాటు అటు ప్ర‌కాశం జిల్లాలోనూ విస్త‌రించి ఉంది. ఈ మూడు సీట్ల నుంచి వ‌చ్చే ఎన్నిక ల‌లో పోటీ చేసేందుకు టీడీపీ త‌ర‌పున చాలా మంది ఆశావాహులు లైన్లో ఉన్నారు. గుంటూరు నుంచి సిట్టింగ్ ఎంపీ గా గ‌ల్లా జ‌య‌దేవ్ ఉన్నారు. ఆయ‌న ఇప్ప‌టికే రెండు సార్లు ఎంపీ గా గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌లో పార్టీ వ్య‌తిరేక గాలు ల‌ను త‌ట్టుకుని మ‌రీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఎంపీ గా గెలిచారు. ఇక వ‌చ్చే ఎన్నిక ల‌లోనూ ఆయ‌న ఇక్క‌డ నుంచే పోటీ చేస్తార‌ని అంటున్నారు.

ఇక న‌ర‌సారావుపేట సీటు కోసం రాయ‌పాటి ఫ్యామిలీ నుంచే ఇద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే న‌ర‌సారావు పేట సీటు రాయ‌పాటి ఫ్యామిలీ కి ఇస్తారా ?  లేదా ? అన్న‌ది స‌త్తెన‌ప‌ల్లి సీటుతో ముడి ప‌డి ఉంద‌నే చెప్పాలి. ఆ ఫ్యామిలీ నుంచి రాయ‌పాటి వార‌సుడు రంగా రావు కు స‌త్తెన‌ప‌ల్లి సీటు ఇస్తే న‌ర‌సారావుపేట సీటు ఇత‌రు ల‌కు ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. ఇక రాయ‌పాటి ఫ్యామిలీకే చెందిన రాయ‌పాటి శైల‌జ పేరు కూడా న‌రాస‌రావు పేట పార్ల‌మెంటు స్ధానానికి గ‌ట్టిగా విన‌ప‌డుతోంది. ఆమె అమ‌రావ‌తి ఉద్య‌మం ద్వారా బాగా పాపుల‌ర్ అవ్వ‌డం తో పాటు పార్టీ ల‌తో సంబంధం లేకుండా స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక బాప‌ట్ల లోక్‌స‌భ స్థానం నుంచి టీడీపీ నుంచి పార్టీ సీనియ‌ర్ వ‌ర్ల రామ‌య్య పేరు ముందు వినిపించింది. అయితే ఆయ‌న త‌న‌యుడు కుమార్ రాజాకు పామ‌ర్రు సీటు ఇవ్వ‌డంతో ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, శ‌ల‌గ‌ల రాజ‌శేఖ‌ర్ ( మాజీ ఎంపీ శ‌ల‌గ‌ల బెంజిమ‌న్ త‌న‌యుడు) పేర్లు ప్ర‌ముఖంగా తెర మీద‌కు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: