ఏపీలో రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరు జిల్లా లో వ‌చ్చే ఎన్నిక‌ల‌లో టీడీపీ తిరుగులేని విజ‌యాలు సాధిస్తుంద‌న్న అంచ‌నాలు అప్పుడే వ‌చ్చేశాయి. ఏపీ లో అధికార వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌ధాని అమ‌రావ‌తిని వికేంద్రీ క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అమ‌రావ‌తి ప్రాంతంతో పాటు గుంటూరు జిల్లాలో వైసీపీ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక త క‌నిపిస్తోంది. దీనిని క్యాష్ చేసుకుని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము టిక్కెట్ తెచ్చుకుంటే చాలు ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోతామ‌న్న భావ‌న చాలా మందిలో ఉంది. అందుకే ఈ జిల్లా నుంచి టీడీపీ టిక్కెట్ల కోసం ఇప్ప‌టి నుంచే డిమాండ్ ఎక్కువుగా ఉంది.

ఈ క్ర‌మంలోనే గుంటూరు న‌గ‌రం లో గుంటూరు వెస్ట్ సీటు కోసం కూడా పార్టీలో అనేక మంది నేత‌లు పోటీ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో అక్క‌డ నుంచి పోటీ చేసిన మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు విజ‌యం సాధించారు. ఇంత వ్య‌తిరేక గాలుల‌ను ఎదుర్కొని కూడా గిరి 12 వేల ఓట్ల మెజార్టీతో సంచ‌ల‌న విజ‌యం సాధించారు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక ఇప్పుడు ప‌శ్చిమ ఇన్ చార్జ్‌గా కోవెల మూడి ర‌వీంద్ర ( నాని ) ని చంద్ర‌బాబు నియ‌మించారు. అయితే ఆయ‌న‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ సీటు వ‌స్తుందా ? అన్న‌ది గ్యారెంటీ లేదు.

ఆయ‌న‌తో పాటు రాయ‌పాటి సాంబ‌శివ రావు త‌న‌యుడు రంగారావు పేరు కూడా వినిపిస్తోంది. ఆయ‌న‌తో పాటు పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మీదే క‌న్నేసి ఇక్క‌డ రాజ‌కీయం చేస్తున్నార‌ని అంటున్నారు. అలాగే తెనాలి నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ గా ఉన్న మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్రప్రసాద్ సైతం గుంటూరు ప‌శ్చిమం కోసం ప్ర‌య‌త్నాలు అయితే ప్రారంభించార‌ట‌. మ‌రి వీరిలో ఎవ‌రికి ప‌శ్చిమం సీటు ల‌క్ చిక్కుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: