పార్టీ కి ఫ్యూచర్ ఉంటుందన్న నమ్మకం ఉంటే ఎవరైనా ఖర్చు పెట్టేందుకు ముందుకు వస్తారు. టీడీపీ కి గతంలో ఎప్పుడూ లేనంత గా ఇప్పుడు ఆర్థిక వనరుల సమస్య ఎదురవు తోంది. పార్టీ కార్యక్రమాలు నిర్వభించేందుకు కూడా ఖర్చులు లేని పరిస్థితి. 2019 ఎన్నికల్లో టీడీ పీ ఏపీలో ఓడిపోయినప్పటి నుంచే ... రెండేళ్లుగా నిధుల సమస్యతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని అంటున్నారు.
ఆ పార్టీ 2004, 2009లో అధికారం కోల్పోయినప్పుడు కూడా పార్టీకి భారీగానే విరాళాలు ఇచ్చారు. ఇక మీ కోసం పాదయాత్ర లో కూడా భారీగా నిధులు వచ్చాయి. సినిమా వాళ్లు సైతం చంద్రబాబుకు 2014 ఎన్నికల కు ముందే భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. అయితే ఇప్పుడు వారు ఎవ్వరూ కూడా టీడీపీ లేదా చంద్రబాబు మొఖం చూసేందుకు కూడా ఇష్టప డడం లేదు. మరో వైపు రెండేళ్లుగా టీడీపీ ఖజానా బోసిపోయిందని అంటున్నారు. టీడీపీ వాళ్ల ఆర్థిక మూలాలపై కూడా జగన్ దెబ్బ కొడుతుండడం మరింత ఇబ్బంది గా మారింది. దీంతో చంద్రబాబు ఆర్థికంగా తీవ్రంగా సతమత మవుతోన్న పరిస్థితే ఉంది.