వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత‌, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా టీడీ పీతో పాటు చంద్ర‌బాబు పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోజా కౌంట‌ర్లు, విమ‌ర్శలు ఎలా ఉంటాయో తెలిసిందే. తాజాగా ఏపీలో టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై వైసీపీకి చెందిన వారు దాడి చేయ‌డంతో ఏపీ రాజ‌కీయం హీటెక్కిన సంగ‌తి తెలిసిందే. దీనిని నిర‌సిస్తూ చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యంలో 36 గంట‌ల నిర‌స‌న దీక్ష‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌లు టీడీపీ పై కౌంట‌ర్ ఎటాక్ చేయ‌డంతో పాటు బాబును తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే రోజా మాట్లాడుతూ పట్టాభి మాట్లాడిన మాటలకు మామూలు వారైనా కోసి ఉప్పూకారం పెట్టేవార‌ని.. కానీ త‌మ పార్టీ అధినేత జ‌గన్ మంచివారు కాబట్టి ఇంకా సంయమనం పాటిస్తున్నార‌ని చెప్పారు. దీనిని అలుసుగా చేసుకుని చెలరేగి రాజకీయాలు చేస్తే ఆధార్ కార్డులు చిరిగిపోతాయ్ అని ఆమె వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే తోలు వలుస్తామ‌న్నారు.

ఇక టిడిపి ఆఫీసు దేవాలయం కాదు అని.. ఆ దేవాల‌యం అన్న మాట‌ ఎన్టీఆర్ తోనే పోయింద‌న్న ఆమె ఆ పార్టీ కార్యాల‌యం క్షుద్ర రాజకీయాలు కుట్ర రాజకీయలకు ఆలవాలమైందని దుయ్య‌బ‌ట్టారు. జగన్ కాలివేలు మీద వెంట్రుకకూడా పీకలేని కొండెర్రిపప్ప లోకేష్ జగన్ చెంపలు వాయిస్తాన‌న‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు భార్య భువనేశ్వరి జోక్యం చేసుకోని చంద్రబాబు, లోకేష్ కు చెప్పి విజయమ్మకు, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

భువ‌నేశ్వ‌రి అలా చేయ‌క‌పోతే ఆమె కూడా ఇలాంటివి ప్రోత్స‌హిస్తున్న‌ట్ట‌గా తాము భావిస్తామ‌ని ఆమె చెప్ప‌డం కొస‌మెరుపు. రాజ‌కీయాల్లో త‌ల్లులు , పెళ్లాలు, అక్కా చెళ్లెళ్ల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డం స‌రి కాద‌ని ఆమె హిత‌వు ప‌లికారు. ఏదేమైనా రోజా చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి ని కూడా ఈ వివాదంలోకి లాగ‌డం సంచ‌ల‌నం గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: