అబ‌ద్ధాలేవో, నిజాలేవో అధికార పార్టీ చెబితేనే బాగుంటుంది. అలాంట‌ప్పుడే మంచి ప‌రిణామాల న‌మోదు కుదురుతుంది. టీడీపీ మాత్రం త‌ప్పులు చేయ‌లేదా? అయితే ఆ రోజు భూముల విష‌య‌మై జ‌రిగిన వివాదాలు అన్నీ త‌వ్వి తీయండి. అలానే విశాఖ కేంద్రంగా జ‌రుగుతున్న భూ అక్ర‌మాల‌పై కూడా మాట్లాడండి. గంజాయి సాగు ఒక్క‌టే కాదు విస్త‌రిస్తున్న ప‌లు అక్ర‌మాల‌పై గొంతెత్తండి కాద‌నరు కానీ మీరు మీ భాష‌కు హ‌ద్దు విధించి మాట్లాడితేనే ప్ర‌జాభిమానం మ‌రింత ఎక్కువ అందుకోవ‌డం ఖాయం.

అధికార పార్టీ త‌ప్పులు చేస్తే చెప్పే హ‌క్కు, నిలువ‌రించే నైజం విప‌క్షానికి ఉంది. ఇదే సంద‌ర్భంలో కాస్త అత్యుత్సాహం త‌గ్గించి, బూతులు లేకుండా మాట్లాడి ప్ర‌జ‌ల మ‌న్న‌న అందుకోవాల్సిన బాధ్య‌త కూడా టీడీపీకి ఉంది. క‌మ్యూనిస్టుల‌కు రాని బూతులు టీడీపీ నేత‌ల‌కు ఎందుకు వ‌స్తున్నాయి అని? ఇంత‌వ‌ర‌కూ అనైతిక భాష‌ను వాడి ఏం సాధించార‌ని? ఏం చెప్పాల‌నుకున్నా భాష‌కు ఇంకా చెప్పాలంటే మంచి భాష‌కు  ప్రాధాన్యం ఇవ్వాల‌ని, మంచి భాష రాని వాడు నాయ‌కుడు ఎలా అవుతాడ‌ని అంటున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు త‌ప్పిదాలు ఆధారాల‌తో స‌హా బయ‌ట ప్రపంచానికి అందించాల్సిన బాధ్య‌త టీడీపీదే! ఎవ‌రు ఔన‌న్నా కాద‌న్నా ఇదే నిజం. కానీ ఇదే సంద‌ర్భంగా పెద్దాయ‌న వ‌య‌సును కూడా ప‌రిగ‌ణించ‌కుండా కొడాలి నాని లాంటి మంత్రులు తిట్ట‌డం అన్న‌ది స‌బ‌బుగా లేద‌ని, ఈ విష‌య‌మై పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని అంటున్నారు ఇంకొంద‌రు.

రాష్ట్రంలో నువ్వా నేనా అన్న విధంగా త‌ల‌ప‌డుతున్నాయి అధికార‌, విప‌క్ష పార్టీలు. చంద్ర‌బాబు సైతం ముందుకన్నా వేగంగా పరి ణామాల‌పై స్పందిస్తున్నారు. కొత్త రాజకీయం ఒక‌టి ఆరంభించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అధికా ర పార్టీ స‌భ్యులు టీడీపీ కార్యాల‌యం పై దాడులు చేయ‌డాన్ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఇదెంత మాత్రం మం చి ప‌ద్ధ‌తి కాద‌ని, అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిని శిక్షించేందుకు కోర్టులున్నాయ‌ని, అంతేకానీ చ‌ట్టం త‌మ చేతుల్లో ఉంద‌న్న భావ న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకుని పోరాద‌ని ప‌లువురు హిత‌వు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు కు మ‌ద్దతుగా టీడీపీ శ్రేణులు రోడ్డెక్క‌నున్నాయి. అయితే మాట‌ల చెప్పేట‌ప్పుడు, లేదా ప్ర‌క‌ట‌న పూర్వ‌కంగా విడుద‌ల చేసే టీడీపీ శ్రేణులు కూడా త‌గ్గితే మేలు అని, త‌గ్గి ఉండ‌డం వ‌ల్ల మంచే జ‌రుగుతుంది త‌ప్ప కీడు జ‌రిగేందుకు అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కు లు. గ‌తంలో కూడా స‌హ‌నం వ‌హించి వెన‌క్కు త‌గ్గిన లీడ‌ర్లు అంతా త‌రువాత మంచి నాయ‌కులుగా పేరు తెచ్చుకుని ప్ర‌జాభిమానం పొందారు అని కూడా గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp