ఏపీ సిఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు చాలా సీరియస్ గా ఉన్నారు. మంత్రులు నిన్నటి నుంచి టీడీపీ నాయకుల విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి అనని మాటలకు కొత్త భాష్యం చెప్పారు అని ఆయన విమర్శించారు. బోస్ డీకే పదానికి 16 అర్దాలు ఉన్నాయి అని గుజరాత్ లో ఒక గ్రామం పేరు.. దాని చరిత్ర తెలుసుకోండి అని ఆయన హితవు పలికారు.

డ్రగ్స్ దందాకు ఏపీ పేరు మారు మోగుతోంది అని ఆయన పేర్కొన్నారు. అదే ఆవేదనను ,ఆందోళన ను టీడీపీ వ్యక్తం చేసింది అని ఆయన తెలిపారు. డ్రగ్స్, గంజాయి ఏపీ నుంచి వస్తున్నాయని తెలంగాణ పోలీసులు చెప్పారు అని ఆయన వివరించారు. డ్రగ్స్ పై తెలంగాణ ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటించారు అని వివరించారు. డీజీపీ కార్యాలయంలో పిఆర్వో గా చేస్తున్న నాయక్ మా పార్టీ ఆఫీస్ కు ఎందుకు వచ్చాడు.. అతనికి ఏమి పని అని ఆయన నిలదీశారు. నేను స్పాటర్ అని చెబుతున్నారు అని... 8.30 కు లోకేష్ పార్టీ ఆఫీస్ కు వస్తే..6.30 కి దాడి చేశాడని కేసు పెట్టారు అని విమర్శించారు.

వీటిపై ఖచ్చితంగా కోర్టుకు వెళతాము అని స్పష్టం చేసారు. మొత్తం ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేసారు. తాడేపల్లి సెల్ టవర్స్ నుంచి..మంగళగిరి వరకు ఫోన్ సిగ్నల్స్, డేటా మొత్తం చూడాలి..బయటకు తీయాలి అని కోరారు. ఏపీ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి దిగజారింది అని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ పనితీరుపై సర్వే చేయాలి అని డిమాండ్ చేసారు. డ్రగ్స్, హెరాయిన్ తో యువత నాశనము అవుతోంది..సమాజం నిర్వీర్యం అవుతోంది అని అన్నారు. సిబిఐ  విచారణ కోసం రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: