రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయని మేము ఊహించలేదు అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రపంచ చరిత్రలో భూతులు తిట్టి దాని ఉద్యమం చేసిన మొదటి పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. భూతులు తిడుతూనే సానుభూతి కోసం చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారు అని ఎద్దేవా చేసారు. పట్టాభి మాట్లాడిన మాటలు తప్పు అని ఒప్పుకుంటే చంద్రబాబు పెద్దరికం నిలబడేది అన్నారు. భూతులు తిట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలని,కేంద్ర మంత్రిని కలవాలి అనుకోవడం ఎంటో విచిత్రంగా ఉందీ అని అన్నారు చంద్రబాబు.

పట్టాభి వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నాడని జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు అర్ధమైంది అని టీడీపీ డీయన్ఎలో ఏముందో అర్థం కావడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధ్యక్షుడు టీడీపీ చేస్తున్న  దీక్ష ఏంటో చెప్పాలని అడుగుతున్నారని అన్నారు. 70ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును చూస్తే జాలేస్తుంది అని ఆయన ఎద్దేవా చేసారు. మేము కడప నుంచి వచ్చాము, పులివేందుల నుంచి వచ్చాము మాకు భూతులు వచ్చు అని అన్నారు. రాజకీయంగా చేతకానప్పుడు భూతులు తిడతారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

అభిమానులను,నేతలను జగన్ అదుపు చేస్తున్నారు.లేదంటే టీడీపీ నేతలకు బుద్ధి చెప్పేవారు అన్నారు సజ్జల. అధికార ప్రతినిధి చేసిన తప్పుకు టీడీపీలో అందరూ  బాధ పడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మేము నిగ్రహంగా ఉన్నాము కాబట్టే టీడీపీ నేతలు ఎన్ని తిడుతున్నా చూస్తూ ఉరుకున్నాం అని అన్నారు. జగన్ పై వ్యక్తిగతంగా మొదటి  నుంచి దాడి చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతల భాషలో వైసీపీ నేతలు తిరిగి  చెప్తే ఒక్కడు కూడా నిలబడలేరు అని విమర్శలు చేసారు. వైసీపీ అభిమానులు ఎందుకు తిరగబడ్డారు అనేది టీడీపీ నేతలు ఆలోచించాలి అని ఆయన హితవు పలికారు. తిట్టడం తప్పు కాదని టీడీపీ నేతలు భావిస్తే ప్రజలే టీడీపీ నేతలకు బుద్ధి చెప్తారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: