మీడియాకు ఇంగితం లేదు. అలా అని ఎవ్వ‌రికీ కూడా నియంత్ర‌ణ లేదు. ఏదో ఒక వివాదం ప‌ట్టుకుని హ‌డావుడి చేయ‌డం క‌న్నా మ‌రొక ప‌ని  పెట్టుకోవ‌డం లేదు. ఇప్పుడు వినిపించే బూతులు అన్నీ నాలుగు రోజులు ఆగాక ఆగిపోతాయి. త‌రువాత కాలంలో  మ‌రిన్ని కొత్త తిట్లు వినిపిస్తాయి. తిట్టే వారంతా హీరోల‌యిపోతారు. తిట్టిన కార‌ణంగా పోలీసు అరెస్టుల‌కు గురైన వారంతా హీరోల‌యి పోతారు. త‌రువాత ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై ఇవే తిట్ల‌ను శాస‌న స‌భ‌లోనూ వినిపిస్తారు. కనీసం ఆలోచ‌న లేకుండా అటు అధికార ప‌క్షం కానీ ఇటు విప‌క్షం కానీ ఎవ‌రిని వారు త‌గ్గించుకుంటూ  జ‌నం ఎదుట చుల‌క‌న అయిపోతున్నారు. అయినా ఇవ‌న్నీ జ‌నం ప‌ట్టించుకుంటారా ఏంటి? ఇదే భావ‌న‌లో ఏ పొలిటీషియ‌న్ ఉన్నా కూడా  ఆ త‌ర‌హా ఆలోచ‌న అస్స‌లు మంచిది కాదు.

నిన్న అన్న మాట ఇవాళ గుర్తుకే ఉండదు. నిన్న చెప్పిన మాట ఇవాళ పాటింపులో ఉండ‌దు. అలాంటిది ఇన్ని తిట్ల‌ను వాటి అ ర్థాల‌ను ఎందుకని బుర్రలో పెట్టుకుంటారు. క‌నుక  నాయ‌కులు త‌మ‌ని తాము తిట్టుకున్నా, త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను తిట్టినా ఇవేవీ ఎ వ్వ‌రూ ప‌ట్టించుకోరు. భాష ఎలా ఉన్నా అదంతా వారికి ఆనందాల‌ను ఇచ్చే విష‌యాలే కావ‌డం విశేషం. క‌నుక ఎంత గట్టిగా తిడితే అంత పెద్ద నాయ‌కుడు ఇప్పుడు. ఇందులో ఆ పార్టీపార్టీ అన్న మిన‌హాయింపే లేదు. ఇష్టం వ‌చ్చిన రీతిన తిట్టుకుంటే వాటిని అస్స‌లు ఎడిట్ ఆప్ష‌న్ అన్న‌దే లేకుండా మీడియా బ్రాడ్ కాస్ట్ చేస్తుంది. అందుకే నాయ‌కులు లైవ్ లో హాయిగా తిట్టుకుంటారు. క నీసం లైవ్ అయిపోయాక కూడా త‌రువాత బులెటెన్ కు కూడా బూతుల‌ను ఆపి బ్రాడ్ కాస్ట్ చేస్తారా అంటే అదీ లేదు.


తెలుగుదేశం నేత‌లూ, వైసీపీ నేత‌లూ ఇదే విధంగా త‌మ‌ను తాము పెంచుకునేందుకు, త‌మ స్థాయి పెరిగేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంగా వీటిని చూడాలి. నాలుగు తిట్లు తిట్టి హీరోల‌యిన నాయ‌కులంతా బాగు ప‌డిన‌ట్లు చ‌రిత్ర చెప్ప‌లేదు. కానీ మ‌న నాయ‌కుల‌కు ఇవేవీ ప‌ట్ట‌వు. అధినాయ‌క‌త్వాల ద‌గ్గ‌ర మెప్పు పొందేందుకు చేసే ఇలాంటి ప‌నులు త‌రువాత త‌రువాత పెను వివాదాల‌కు కార‌ణం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: