స్పందనపై సీఎం వైయస్‌ జగన్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధిహామీపై సీఎం మాట్లాడుతూ ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టండి అని అధికారులను ఆదేశించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురంజిల్లాల్లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపై తగిన దృష్టిపెట్టండి అని ఆయన కోరారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారు అని అన్నారు.

వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తిచేయాలి అని స్పష్టం చేసారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు దృష్టిపెట్టాలి అని జగన్ కోరారు. వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో డిజిటిల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు ఆయన. అవాతంరాలు లేకుండా ఇంటర్నెట్‌ను సరఫరాచేస్తాం అని స్పష్టం చేసారు. దీనివల్ల వర్క్‌ ఫ్రం హోం కాన్సెప్ట్‌ సాకారం అవుతుంది అన్నారు.

డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేసారు. తొలి విడత లో భాగంగా  4314 లైబ్రరీలను నిర్మిస్తున్నాం అని తెలిపారు. ఈ లైబ్రరీల నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోండి అని ఆదేశించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అని కోరారు ఆయన. పంట కొనుగోలు జరగాలంటే ఇ– క్రాపింగ్‌ చేయాలి అని విజ్ఞప్తి చేసారు. ఇ– క్రాపింగ్‌ చేయించడమన్నది ఆర్బీకేల ప్రాథమిక విధి అన్నారు జగన్. ఇ– క్రాపింగ్‌పైన కలెక్టర్లు, జాయంట్‌ కలెక్టర్లు దృష్టిపెట్టాలి అని స్పష్టం చేసారు.సీఎం–యాప్‌ పైన కూడా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఇ– క్రాపింగ్‌ చేసిన తర్వాత డిజిటల్‌ రశీదుతోపాటు, భౌతికంగా కూడా రశీదు ఇస్తున్నారా? లేదా?చూడాలి అన్నారు. గ్రామంలోని ప్రతి ఎకరా కూడా ఇ–క్రాపింగ్‌ జరగాల్సిందే అని స్పష్టం చేసారు. నెల్లూరులో జరిగిన ఘటన నాదృష్టికి వచ్చింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోమని చెప్పాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: