అమెరికా సంస్థ గూగుల్ తో రష్యా కొత్త వివాదాలు బయటపడుతున్నాయి. అంటే ఇటీవల భారత్ లో ట్విట్టర్ సహా పలు సామజిక మాధ్యమాలలో ఇష్టానికి దుష్ప్రచారం జరుగుతున్నందున ఆయా పోస్టులను తొలగించాలని సూచనలు చేసింది. లేని పక్షంలో భారత చట్టాలను అనుగుణంగా చర్యలు తీసుకోబడతాయని మరోసారి కఠినంగా కూడా చెప్పింది. అయినా వినకపోవడంతో దానికి బదులుగా ప్రాంతీయ సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా లో కూడా అదే జరిగింది. అయితే ఈ అమెరికా సంస్థలు ఎక్కడ పెట్టినా తాము అమెరికా చట్టాలను అనుగుణంగా మాత్రమే నడుచుకుంటాము అంటూ చెపుతుండటం పట్ల ఆయా దేశాలలో వ్యతిరేకత కొనసాగుతుంది.

గతంలోనే రష్యా గూగుల్ మధ్య వివాదం వలన పూర్తిగా ఆ సంస్థ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు చెప్పింది. దీనితో అక్కడ ఆయా వినియోగాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే ఉన్న కాస్త కూడా రష్యా కు వ్యతిరేకంగా వార్తలు రాస్తుండటంతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికి కూడా గూగుల్ సంస్థ రష్యా ప్రభుత్వ మాటలు వినకుండా అది ప్రతిపక్షం వాళ్ళు చెప్పినట్టుగా రాయడం జరిగింది అంటూ చెప్పుకొస్తుండటంతో రష్యా మరోసారి ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమిస్తుంది.

సాధరణంగా గూగుల్ కూడా అమెరికా సంస్థ కనుక, దాదాపు అమెరికా రష్యా ఎప్పుడు పెద్దగా కలిసి నడిచేవి కాకపోవడంతో ఇలాంటివి సహజం. రష్యా కి వ్యతిరేగా ఉన్న వార్తలను గూగుల్ సంస్థ తీసివేయాలని కోరినా అది అనుసరించలేకపోవడంతో మళ్ళీ పరిహారాల వరకు వెళ్తుందా లేక సామరస్యంగా ముగుస్తోందా అనేది వేచి చూడాల్సి ఉంది. కరోనా సమయంలో అందరి మనసులు దూరం అయినప్పటికీ, పరిస్థితులు ఒకరిని ఒకరికి దగ్గర చేసే స్థితి వస్తుందేమో అనే ఆలోచన ఉగ్రమూకలకు వచ్చినట్టే ఉంది  అందుకే ప్రతి చిన్న విషయాన్నీ యాగీ చేసి మరి ఆయా దేశాల మధ్య పట్టుదలలు పెంచుతున్నాయి. ఇది కూడా అలాంటి ఒక చర్యగా నిపుణులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: