టాలీవుడ్ హీరో వెంకటేష్ నటించిన  మల్లీశ్వరి సినిమా అందరూ చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలో పెళ్లి కాని ప్రసాద్ గా నటించాడు వెంకటేష్. ఎంత ప్రయత్నించినప్పటికీ పెళ్ళికాకుండా ఇక అలాగే బ్రహ్మచారిగా ఉండిపోయిన  వెంకటేష్ ను అందరూ పెళ్లికాని ప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు . అయితే ఇక ఇప్పుడు చైనాలో యువకుల పరిస్థితి కూడా అచ్చంగా మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ మాదిరిగానే పెళ్లి కాని ప్రసాద్ లాగా మారిపోయింది అని అర్థమవుతుంది.


పాపం చైనా పరిస్థితి రోజురోజుకు దారుణం గా మారిపోతుంది. ఇప్పటికే చైనాలో వివిధ రకాల సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థను తీవ్రస్థాయిలో దెబ్బతీస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాలో రియల్ట్ సంక్షోభం ఏర్పడటం  ఆర్థిక వ్యవస్థకు షాక్  అని చెప్పాలి.  అయితే ఇక ఇప్పుడు మానవ వనరుల కొరత కూడా ఏర్పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇక అక్కడ ఆడ పిల్లల పుట్టుక రోజురోజుకు తక్కువ అవుతుంది. దీంతో చైనాలో అందరూ పెళ్లికాని ప్రసాదులు గా మారిపోతున్నారు. అక్కడ ఉన్న పురుషులతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో యువకులు  పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది చైనాలో. దీంతో ఎంతో మంది యువకులు చైనాలో పెళ్లి చేసుకోకుండానే ఉండి పోతున్నారట. ఇటీవల ఈ విషయాన్ని చైనా కు సంబంధించిన వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ చెప్పడం గమనార్హం. చైనాలో రోజురోజుకు ఆడపిల్లల పుట్టుక గా తగ్గిపోతుందని అదే సమయంలో  మగ పిల్లల పుట్టుక రోజురోజుకూ పెరిగిపోతోందని తద్వారా కనీసం పెళ్లి చేసుకోవడానికి కూడా చైనాలో ఆడపిల్లలు దొరకని పరిస్థితి నెలకొంది  అంటూ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం  పెళ్లికాని యువకుల అందరికీ కూడా ఒక సలహా ఇస్తోందట. భర్త చనిపోయిన వారిని లేక భర్త వదిలేసిన వారిని వారు చూసుకుని పెళ్లి చేసుకోవాలి అంటూ అక్కడి ప్రభుత్వం కూడా సూచిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: