చైనాలో సంక్షోభాలు ఒకదానితరువాత ఒకటి వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే కుదేలవుతున్న  అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ బాట పట్టాయి మరి కొన్ని సంస్థలు. దీనితో మరో దెబ్బతో చైనా అల్లాడిపోతోంది. కరోనా కారణంగా ఆ దేశం విడిచి పెట్టి వెళ్లిన ఎవరూ అక్కడకు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోవడంతో అక్కడ ప్రారంభించిన లేదా ఇప్పటికే సిద్ధంగా ఉన్న అనేక రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారాలు వారు కట్టిన ఇళ్లను ఎవరూ తీసుకోకపోవడంతో అప్పులపాలైపోతున్నాయి. చైనా కు మాత్రం ఇప్పట్లో ఎవరు కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఇక దాదాపుగా అక్కడ రియల్ సంస్థలు కుప్పకూలినట్టే అవుతుంది. ఇది చైనా కు భారీ నష్టాన్నే మిగులుస్తుంది. దాదాపు చైనా రియల్ ఎస్టేట్ సంస్థలు అన్ని ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఇప్పటికే ఇక్కడ ఎవర్ గ్రాండ్ పూర్తిగా దివాళా తీసింది. అలాంటివి మరో పదిహేను అదే స్థితిలో ఉన్నాయి. ఈ నష్టం దాదాపు 3 ట్రిలియన్ డాలర్లు మేర జీడీపీ ప్రభావం ఉంది. తాజా సంస్థల దివాళాతో 18 ట్రిలియన్ డాలర్లు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే చైనా దాదాపుగా 165 దేశాల నుండి 385 బిలియన్ డాలర్లు అప్పులు చేసింది. వంటిని తీర్చలేని స్థితిలోకి చైనా పూర్తిగా సంక్షోభం లోకి వెళ్ళిపోయింది. దీనితో చైనాలో పూర్తిగా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నట్టే అంటున్నారు నిపుణులు.

ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఇవన్నీ దాచేసి తాను గొప్పగానే ఉన్నట్టు ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే లేనిపోని కవ్వింపులతో అటు తైవాన్ ను ఇటు భారత్ ను సరిహద్దులలో ఇబ్బందులకు గురిచేస్తుంది. తాజా పరిస్థితులు చైనా పతనానికి దారితీయడంతో, ఈ గ్యాప్ లో భారత్ పుంజుకుంటే, తాను వెనక పడిపోతానేమో అనే భయం తో భారత్ ను కోలుకోలేని దెబ్బ కోట్లని తీవ్రంగా ప్రయత్నిస్తుంది చైనా. మరోపక్క అధికార దాహంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఆక్రమణ ద్వారా తమపార్టీ ఆధిపత్యాన్ని చూపాలని చూస్తున్నాడు. పొరపాటున యుద్ధంలో చైనా ఓడిపోతే, ఇక ఆ పరిస్థితి ఊహించనలవి కానివి.

మరింత సమాచారం తెలుసుకోండి: