క‌లుగులో ఉన్న విష‌యాల‌న్ని బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  తెలంగాణ రాజ‌కీయాల్లో ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవ‌ర్టులు ఉన్నార‌నేది అంద‌రూ చెబుతున్నారు. రేవంత్ స్వ‌యంగా చెప్పిన మాటే అది. కౌశిక్ రెడ్డి పార్టీలో నుంచి వెళ్లిపోవ‌డం ఆ ప్ర‌చారాన్ని నిజం చేసిన‌ట్ట‌యింది. ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయ‌ పార్టీ నేత‌లు ప్ర‌తి ప‌క్ష పార్టీల వాళ్ల‌కు కొత్త అనుమానాలు సృష్టిస్తున్నారు. అలాంటి వివాదంలోకి కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్, ద‌ళిత నేత బ‌ట్టి విక్ర‌మార్క వ‌చ్చి చేర‌డం ఇప్పుడు తెలంగాణ అంతా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అది సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ అన‌డంతో ఇంకా హీటెక్కిపోయింది.
 

    హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ కొత్త అంశం తెర మీద‌కు వ‌చ్చింది. దీన్ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. ఉప ఎన్నిక త‌రువాత హ‌రీష్ రావును బ‌య‌ట‌కు పంపేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని రేవంత్ బాంబ్ పేల్చారు. దీంతో కేటీఆర్ నాలుగు అడుగులు ముందుకేసీ ఈట‌ల గెలిస్తే మాత్రం కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తాడ‌ని చెబుతూ త‌న ద‌గ్గ‌ర ప‌క్కా స‌మాచారం ఉంద‌న్నారు. అలాగే, అత‌నితో పాటు మాజి ఎంపీ వివేక్ కూడా వెళ్లిపోడాని ఓ బాంబ్ వేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రూ స‌రైన వాళ్లు లేర‌ని బ‌ట్టి విక్ర‌మార్క ఒక్క‌రే మంచివార‌ని కితాబిచ్చారు.


 దీంతో, ప్ర‌తిప‌క్ష నేతను  కేటీఆర్  పోగ‌డం ఏంట‌ని కొంప‌దీసి బ‌ట్టి విక్ర‌మార్క గులాబీ కారు ఎక్క‌నున్నాడా అని అంద‌రూ అనుకుంటున్నారు. కొంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే, ఈ మ‌ధ్య బ‌ట్టి వ్య‌వ‌హార శైలీ కూడా త‌ర‌చూ వివాదాస్ప‌దం అవుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించే ద‌ళిత‌బంధు కు సంబంధించి ఏ స‌మావేశానికైనా బ‌ట్టి హాజ‌ర‌వుతున్నారు. అంతే కాదు, బ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ గ్రామాన్ని ద‌ళిత‌బంధు అమ‌లు కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు కూడా. ఈ క్ర‌మంలో కేటీఆర్ బ‌ట్టిని పొగ‌డంతో పాత క‌థ‌లు అన్ని బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. దీంతో ఆయ‌న ఏం రిప్లే ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు ఇవ్వ‌ర‌ని కొంద‌రు అనుకుంటున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: