గౌరీ లంకేష్ హత్య : సుప్రీం కోర్టు ఏమంటోంది ?

దారుణ హత్యకుగురైన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్  కేేసులో సర్వోన్నత న్యాయ స్థానం తాజా వ్యాఖ్యలు చేసింది. గౌరీ లంకేష్ సోదరి కవిత లంకేష్ ఈ కేసు పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్ప యంత్రాగం తీరును, హై కోర్టును ప్రతివాదులుగా చేస్తు  కవిత  సర్వోన్నత న్యాయస్థానం లో కేసు నమోదు చేశారు.
ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ బెంగళూరు లోని తన నివాసంలో 2017లో  సంవత్సరం సెప్టంబర్ 5న హత్యకు గరుయ్యారు.  గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తుపాకితో కాల్చి చంపారు.  ఆమె తన  రచనల్లో స్పష్టమైన అభిప్రాయాలను వెలిబుచ్చేవారు. హిందుత్వ రాజకీయలపై ఆమె ఎక్కువ గా విమర్శలు చేస్తూ రచనలు చేసేవారు.  ప్రతి సమస్యనూ ఆమె సామాజిక కోణం లోనుచి పరీశీలనాత్మక దృష్టి తో చూసేవారు. ఆమె హత్యను భారత దేశంలో మీడియా వ్యక్తులతో పాటు, విదేశీ పాత్రికేయులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ హత్య పై  దేశ విదేశీ మాధ్యమాలలో చర్చలు సాగాయి.దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
కర్ణాటక   హై కోర్టు  ఈ ఏడాది ఏప్రిల్ లో  నిందితుల్లో ఒకరైన మోహన్ నాయక్ పై మొపిన అభియోగాలను తిరస్కరించింది. అతని పై వ్యవస్థీకృత నేరం (ఆర్గనైజ్డ్ క్రైం) కేసు నమోదు చేయవద్దని తెలిపింది. తొలుత సమర్పించిన చార్జ్ షీటో లో అతని పేరు లేనందున నిందితుడిపై వ్యవస్థీకృత నేరం నమోదు చేయనవసరంలేదని సూచించింది. ఈ విషయం పై కవితా లంకేష్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన సోదరి హత్య కేసులో నిందితులకు మోహన్ నాయక్ వనరులు సమకార్చారని, వసతి సౌకర్యాలు కల్పించారని ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. గౌరీ లంకేష్ హత్యకు ముందు, హత్య చేసిన తరువాత నిందితులు మోహన్ నాయక్ సహాయ సహకారాలు తీసుకున్నారని కవిత కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
గౌరీ లంకేష్ కేసులో ఆమె సోదరి కవిత లంకేష్, తన మిత్రులైన కొందరు న్యాయ వాదులతో కలసి స్వయంగా వాదించారు. మోహన్ నాయక్ తరఫున సీనియర్ న్యాయవాది విశ్వ ప్రభు ఎస్ పాటిల్ తన వాదనలు వినిపించారు. తన క్లైంట్  నేరుగా ఏ  విధమైన నేరం చేయలేదని, అతని పై ఆర్గనైజ్డ్ క్రైం కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలను కోర్టు త్రోసిపుచ్చింది. నిందితులకు పరోక్షంగా సహకరించినా అది నేరమే అవుతుందని సుప్రీం కోర్టు  స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: