కరోనా వైరస్ ప్రస్తుతం అదుపులోనే ఉంది. ప్రస్తుతం దేశంలో వంద కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తయ్యింది. ఇక చాలా దేశాల్లో కొవిడ్ నిబంధనలు కూడా సడలించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా యధావిధిగా సాగుతున్నాయి. ఇక రాష్ట్రాల్లో కూడా అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కార్యకలాపాలు మునుపటిని తలపిస్తున్నాయి. థియేటర్లలో వంద శాతం అనుమతులు మంజూరు చేశారు కూడా. ఈ పరిస్థితుల్లో చాలా మంది మన దేశంలో కొవిడ్ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందనే ధీమాతో మాస్క్ వాడకం పూర్తిగా తగ్గించేశారు. ఏదో ఫార్మాలిటీ కోసం అన్నట్లుగా పోలీసులు కనిపిస్తే... అలా పెట్టుకుని... ఇలా తీసేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే... వారి జేబులకు చిల్లు పడినట్లే. తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందే. లేదంటే ఏకంగా వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సిందే.

ఇదే సమయంలో రహదారి నిబంధనలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. నిబందనలు ఉల్లంఘించే వారికి ఇకపై కొరఢా ఝుళిపించనున్నారు. ద్వి చక్ర వాహనంపై వెళ్లే వారిపై ముందుగా ఫోకస్ పెట్టింది కేంద్రం. రోడ్డు ప్రమాదాలపై తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం... ఎక్కువ మంది బైక్ ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా హెల్మెట్ ధారణ లేకపోవడమే అని నిర్థారించారు. దీంతో ఇప్పుడు తాజాగా కొత్త రూల్ అమలు చేసేందుకు మెగా ప్లాన్ వేసింది. ఇకపై ద్వి చక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాల్సిందే. వాహనం నడిపే వారితో పాటు... వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పని సరి. లేదంటే... వెయ్యి రూపాయలు జరిమానా కట్టాల్సిందే. ఇది మొదటి సారి. రెండవ సారి అయిత్ రెట్టింపు వసూలు చేస్తారు. ఇకపై బైక్ పై వెళ్లే వారు... దారిలో ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే... ముందుగా హెల్మెట్ ఉందా... లేదా చూసుకోవాల్సిందే. ఇప్పటి వరకు వాహనం నడిపే వారిపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. దీంతో... దాదాపు 90 శాతం మంది హెల్మెట్ ధరిస్తున్నారు. ఇకపై వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరి చేసింది కేంద్రం. ఇప్పటికే బెంగళూరు నగరంలో ఈ రూల్ అమలు చేస్తున్నారు. వెనక ప్రయాణించే వారు హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం చలాన తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: