ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయం రోజు రోజు ర‌స‌వ‌త్తంగా మారుతుంది. అక్క‌డి అధికార పార్టీ ఐఎస్ఆర్‌సీపీ కి ప్ర‌తిప‌క్షం తెలుగు దేశం పార్టీల మ‌ధ్య మాటల యుద్ధం నుంచి దాడుల వ‌ర‌కు వ‌చ్చింది. అయితే త‌రుచూ వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ ఆంధ్ర ప్ర‌దేశ్ లో జరుగుతున్న ప‌రిణామాల పై వ్యంగ్యం స్పంధించాడు. త‌న స్పంద‌నను తాజాగా ట్విట్ట‌ర్ వేదిక గా పంచుకున్నాడు. ప్ర‌స్తుతం రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ట్విట్ వైరైల్ గా మారింది. రామ్ గోపాల్ వ‌ర్మ‌ గతంలో కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాల పై అనేక సార్లు త‌న దైన శైలి సెటైర్లు వేశాడు.



తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ట్వీట్ట‌ర్ అకౌంట్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలిపాడు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాజ‌కీయ ప‌రిస్థితులు రోజు రోజు కు మారుతున్నాయి అని అన్నాడు. అతి త్వ‌ర‌లో నే ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయ నాయ‌కులు బాక్సింగ్, క‌రాటే, క‌ర్ర సాము వంటి యుద్ద క‌ళ‌లు నేర్చుకోవాల్సి వ‌స్తుంది అని వ్యంగంగా రామ్ గోపాల్ వ‌ర్మ అన్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాజ‌కీయం వేడెక్కుతుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తెలుగు దేశం జాతీయ పార్టీ కార్య‌ల‌యం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. దీన్ని నిర‌సిస్తూ బుధ‌వారం ఆంధ్ర ప్ర‌దేశ్ వ్యాప్తంగా బంద్ నిర్వ‌హించారు. అలాగే నేటి నుంచి 36 గంటల పాటు టీడీపీ అధినేత చంద్ర బాబు దీక్ష చేస్తున్నారు. అయితే దీని పై జగ‌న్ మాత్రం ప్ర‌తి ప‌క్షం రాష్ట్ర అభివృద్ధి ని అప‌డానికి కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని అన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ప‌రిణామాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య యుద్ధ వాత‌వార‌ణం నెల‌కొంది. ఈ సంద‌ర్భంలో రామ్ గోపాల్ వ‌ర్మ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: