ఏపీలో సీఎం సొంత జిల్లా క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన తెలుగు దేశం పార్టీ పోటీ నుంచి త‌ప్పుకుంది. అయితే ఇక్క‌డ మ‌రో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అయిన జ‌న‌సేన పార్టీ కూడా పోటీలో లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం త‌మ పార్టీ నుంచి ఇక్క‌డ అభ్య‌ర్థిని పోటీ పెట్ట‌నని చెప్పారు. ఇక ఇక్క‌డ నుంచి వైసీపీ క్యాండెట్ గా ఇటీవ‌ల మృతి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ ను పోటీలో పెట్టింది.

ఇక ఇక్క‌డ నుంచి బీజేపీ తో పాటు కాంగ్రెస్ పోటీ లో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా రెండో స్థానంలో ఉండేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ కి ఇక్క‌డ పెద్ద షాకులే త‌గులుతున్న ప‌రిస్థితి ఉంది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక విష‌యంలో కూడా బీజేపీ నేత‌లు ఢిల్లీ లెవ‌ల్లో ఈసీకి ఫిర్యాదులు చేయ‌డం పెద్ద షాకింగ్ గా మారింది. అస‌లు ఆ పార్టీకి ఇక్క‌డ ప‌ట్టుమ‌ని ప‌ది వేల ఓట్లు కూడా వ‌స్తాయా ? అంటే చాలా సందేహాలే ఉన్నాయి.

అయితే ఇప్పుడు బీజేపీ వాళ్లు అక్క‌డ ఓట‌ర్ల‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు బెదిరిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. ఇక ఏపీ మంత్రులు అంద‌రూ బ‌ద్వేల్లో మ‌కాం పెట్టి మ‌రీ ఓట‌ర్ల‌ను బెదిరి స్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అయితే వాస్త‌వంగా అక్క‌డ బీజేపీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని తెలుస్తోంది. బ‌ద్వేల్లో బూత్ ల వారీగా బీజేపీ కి ఏజెంట్ల‌ను కూర్చోబెట్ట‌డానికి ఆ పార్టీ నేత‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నార‌ట‌. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఈ ఉప ఎన్నిక కోసం బూత్‌ల వారీగా ఏజెంట్ల‌ను పెట్టేందుకు ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నార‌ట‌. అది అక్క‌డ బీజేపీ ప‌రిస్థితి అని సెటైర్లు ప‌డుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: