కోవిడ్ అలర్ట్ :  రష్యాలో వెయ్యి మందికి పైగా మృతి .. రెండు వారాలు లాక్ డౌన్

రష్యాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోది. గత  ఇరవై నాలుగు గంటల్లో  దాదాపు వెయ్యి మందికి పైగా మరణించారని  రష్యా అధికార వర్గాలు ప్రకటించాయి. మాస్కో మేయర్ సెర్జీ సొబయానిన్ ఈ  విషయాన్ని ప్రకటించారు.  ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. వాపార సంస్థలు, విద్యా సంస్థలకు  రెండు వారాల పాటు శలవు ప్రకటించారు.  తక్షణం ఈ అదేశాలుఅమలు చేయాలని అదేశాలు జారీచేశారు. మాస్కో నగరంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని మేయర్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా పరిస్థితులు ప్రమాద కరంగా మారాయని తెలిపారు.


 
ప్రస్తుతం ఇచ్చిన అదేశాలతో పాటు, రష్యా రాజధాని నగరం మాస్కో అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వ తేదీ వరకూ   నాన్ వర్కింగ్ డేస్ గా పరిగణించ నుంది. ఈ ప్రాంతంలో అన్ని కార్యకలాపాలు బంద్ అవుతాయి అని మేయర్ ప్రకటించారు. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ఇంకోక మార్గం లేదని ఆయన తెలిపారు. తాజా ఉత్తర్వులతో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, క్రీడా విభాగాలు, సాంస్కృతిక కేంద్రాలలో ఎలాంటి కార్యకలాపాలు ఉండరాదు. అన్ని కార్యక్రమాలను నిషేధించారు. మాస్కో లోని అన్ని అధికార కార్యాలయాలు మూతపడనున్నట్లు మేయర్ తెలిపారు. పనిదినాలు అమలు  చేసినందు వల్ల కరోనా  వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్నదని తమ అనుభవంలో తేలిందని,  కోవిడ్-19 ను అరికట్టాలంటే  లాక్ డౌన్ ఒక్కటే మార్గమని  మేయర్ సెర్జీ సొబయానిన్  ప్రకటించారు. 'ఇళ్లలో విశ్రాంతి తీసుకోండి... దాని వల్ల వేలాది మందికి ఆరోగ్య రక్షణ కల్పించిన వారమవుతాము.  బైటికి వస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే విషయం గుర్తుంచు కోండి. కొద్ది రోజులలో పరిస్థితులు చక్కబడుతాయని ఆశిస్తున్నా' .. అని మేయర్ ప్రకటించారు.  
రష్యా ఆరోగ్య శాఖ నుంచి గణాంకాలు తెప్పించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్  నేరుగా రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షించారు. గడచిన 24 గంటల్లో 1,036 మంది కరోనా బారిన పడి చనిపోయారు.   కొత్తగా మరో 37 వేల మంది కి కరోనా సోకింది.  కరోనా బాధితుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ నమోదు కావడంతో  ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: