వెనక‌డుగు వేసినంత మాత్రాన మ‌నుషులు చెడ్డ‌వారు అయిపోరు. అదేవిధంగా అస‌మ‌ర్థులు అన్న ట్యాగ్ ను త‌గిలించుకోవాల్సి న‌ అవ‌స‌ రం కూడా లేదు. కానీ జ‌గ‌న్ హుందాత‌నం చాటుకోవాల్సిన చోట చాటుకోవ‌డం లేదు. ఇక‌నైనా కాస్త నెమ్మ‌దించండి అని మంత్రుల‌కు చె ప్ప‌వ‌చ్చు. ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తి హుందాగా ఉంటేనే మంచి పేరు వ‌స్తుంది. నాలుగు మాట‌లు ప‌డ్డాకే మీరు సీ ఎం అయ్యారు. న‌లు గురుక‌లిసి మిమ్మ‌ల్ని టార్గెట్ చేశా కే మీ ల‌క్ష్యాన్ని అల‌క్ష్యం చేయ‌కుండా చేరుకోగ‌లిగారు. కాస్త మీరు త‌గ్గితే మీ ఇమేజ్ పెరిగేది. అదేవి ధంగా జ‌నంలో మీపై ఉన్న సా నుకూల దృక్ప‌థం కూడా పెరిగేది. రాజ‌కీయంలో ఇవి మామూలే అన్న విష‌యం మీరు గుర్తించి, ఇంకొం త సంయ‌మ‌నం పాటిద్దాం అని భారం దేవుడిపై వేసి ఉంటే ఇంకా మంచి పేరు మీకే వ‌చ్చేది.

- ఇదీ జ‌గ‌న్ పై సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న చ‌ర్చ‌ల సారాంశం.

గ‌తంలో జ‌గ‌న్ కూడా..!
రాజ‌కీయంలో తిట్లూ, శాప‌నార్థాలు అన్న‌వి ఎప్ప‌టిక‌ప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న జ‌గ‌న్ కూడా గ‌తంలో అప్ప‌టి సీఎంను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పాద‌యాత్ర‌లో కొన్ని అన‌రాని మాట‌లు అన్నారు. అప్పు డు కూడా జ‌గ‌న్ ను టీడీపీ  స‌ర్కార్ అరెస్టు చేయ‌లేదు. పాద‌యాత్ర‌ను అడ్డుకోలేదు. ఏ విధమ‌యిన దాడుల‌నూ వైసీసీ కార్యాల‌యాల‌పై చేయ‌లేదు. కానీ ఓ కొత్త సంస్కృతిని తెచ్చి పెట్టారు జ‌గ‌న్. ఇక‌పై త‌మ‌ను ఎవ‌రు ఏమ‌న్నా వాళ్ల ఇళ్ల‌పై  ప‌డి దా డులు చేస్తామ‌ని చెప్ప‌క‌ నే చెప్పారు. దీంతో టీడీపీ వ‌ర్గాలు నిజంగానే హ‌డ‌లిపోతున్నాయి. విమ‌ర్శ‌లు చేసేందుకు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి. కొంద‌ రైతే ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అని పార్టీ చెప్పిన నిర‌స‌నల్లో భాగం పంచుకుని ఏం మాట్లాడకుండానే ఇంటికి వెళ్లిపోతున్నారు.ఈ ద‌శ‌లో జ‌గ‌న్ తీరుపై కూడా అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


అభిమానులే చేశార‌న‌డం స‌రికాదు :
టీడీపీ రాష్ట్ర కార్యాల‌యంపై భౌతిక దాడులు చేశారు స‌రే నిన్న కొడాలి నాని అనే మంత్రి ఏం మాట్లాడారు. చంద్ర‌బాబును, ఆయ‌న కొడుకును ఏ విధంగా తిట్టారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణనలోకి తీసుకోరా? జ‌గ‌న్ త‌న‌ను తిట్టిన వారిని వ‌దిలిపెట్టేదే లేద‌న్న సంకేతాలు ఇస్తూ, ఈ ప‌ని తాను చేయించ‌లేద‌ని త‌న‌పై ఉన్న అభిమానంతో కొంద‌రు చేశార‌ని చెప్ప‌డం ముమ్మాటికీ త‌ప్పే. శాంతి భ‌ద్ర‌త‌లు అన్న‌వి జ‌గ‌న్ ప‌రిధిలో ఉన్న విష‌యాలు. అవి చేయి జార‌కుండా చూడాల్సిన బాధ్య‌త జ‌గ‌న్ ది. అది వ‌దిలేసి అస్స‌లు నాకు సం బంధ‌మే లేద‌ని చెప్ప‌డం అన్న‌ది త‌ప్పు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp