ప్రజల కోసం పోరాడుతోంటే కేసులు పెడుతున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేసారు. తాను జైలుకెళ్లడానికైనా సిద్దం అంటూ ఆయన సవాల్ చేసారు. నేనేం దేశాన్ని దొబ్బి జైలుకెళ్లడం లేదు అని అన్నారు నారా లోకేష్. పార్టీ కార్యాలయంలోకి జొరబడ్డ సీఐను కాఫీ, టీ ఇచ్చి పంపితే హత్యాయత్నం కేసు పెట్టారు అని విమర్శించారు. తల పగులకొడితే పెట్టీ కేసు పెట్టారు అన్నారు. మేమేం అమ్మ మొగుడని అనలేదే..? పట్టాభి ఏదో అన్నాడని ఫీలవుతోన్న సీఎం.. తన వద్దనున్న మంత్రి ఏపీలోని తల్లులందర్నీ తప్పుడు మాటలు అనలేదా..? అంటూ ప్రశ్నించారు.

మైదుకూరు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు.. హత్యకు ప్రేరేపించడం కాదా..? అని ఆయన నిలదీశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన రోజు మేం రెచ్చగొడితే డీజీపీ ఆఫీస్ ఉండేదా..? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో సీఎం జగన్ డిఫెండ్ చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చింది అని అన్నారు. సీఎం జగన్ తీరుపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అని విమర్శించారు. పార్టీ గుర్తింపు రద్దు చేయమని వైసీపీ ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి.. నష్టం లేదు అని అన్నారు లోకేష్ చేసారు.

కార్యకర్తలు రోడ్ మీదకొస్తున్నారు.. భయపెట్టేందుకే దాడులు అని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఏపీలో పోలీసింగ్ దెబ్బతింది అని ఆరోపణలు చేసారు. పోలీసింగ్ దెబ్బతినడం వల్లే గంజాయి సాగు, సరఫరా పెరుగుతోంది అని అన్నారు. గంజాయి సాగు, సరఫరా పెరుగుతోన్నా.. సీఎం కట్టడి చేయడం లేదు అని మండిపడ్డారు. కేజీ గంజాయికి ఇంత అని ముడుతుండడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తోంది అని డ్రగ్స్ కట్టడి చేయకుంటే ఓ జనరేషన్ దెబ్బ తింటుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అందుకే మేం ఫోకస్ పెట్టాం అన్నారు. గతంలోనూ రోడ్లు.. ధరల పెరుగుదల విషయంలోనూ ఆందోళన చేపట్టాం అని పేర్కొన్నారు. వైసీపీకి జగన్ ప్రెసిడెంట్.. పీకే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అమిత్ షాకు ఫోన్ చేశాం.. చంద్రబాబు ఫోన్ చేశారో.. లేదో.. సజ్జలే అమిత్ షా కు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చుగా..? అని హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: