కొంతకాలంగా ఏపీ రాజకీయాలని పరిశీలిస్తే టి‌డి‌పి అధినేత చంద్రబాబు....ఏ కార్యక్రమం చేసినా పెద్దగా సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. అసలు 2019 ఎన్నికల ముందు నుంచి బాబు చేసిన కార్యక్రమాలు ఏవి సక్సెస్ కాలేదు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక...ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏం చేసినా వర్కౌట్ కావడం లేదు. అసలు జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి...చంద్రబాబు వేరే పని పెట్టుకోలేదు...ఎంతసేపు జగన్‌ని విమర్శించడం....ప్రభుత్వంపై విమర్శలు చేయడమే చేస్తున్నారు.

ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తూనే వచ్చారు....కానీ అలా చంద్రబాబు...జగన్‌ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ కాలేదు. ఆ విషయం స్థానిక ఎన్నికల ఫలితాల్లోనే అర్ధమైపోతుంది. అయినా సరే బాబు తన ప్రయోగాలు ఆపడం లేదు. ఎలాగైనా జగన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దీని వల్ల పావలా ఉపయోగం లేదని అర్ధమైపోతుంది.

తాజాగా వైసీపీ శ్రేణులు...టి‌డి‌పి ఆఫీసులపై దాడులకు నిరసనగా చంద్రబాబు, రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కానీ బంద్ ఏ మాత్రం సక్సెస్ కాలేదు. సాధారణంగా ప్రతిపక్షాలు చేసే బంద్‌లు సంపూర్ణంగా సక్సెస్ కావు....కానీ కొంతవరకు ప్రభావం ఉంటుంది. అయితే టి‌డి‌పి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కొడాలి నాని అన్నట్లు బాబు...ఒక్క బడ్డీ కొట్టు కూడా మూయించలేకపోయారు. అంటే బాబు...మాటలని ప్రజలు పట్టించుకోవడం లేదనే అర్ధమైపోయింది. ప్రజలే కాదు బాబుకు సొంత పార్టీ నేతల నుంచి కూడా సపోర్ట్ అంతగా రావడం లేదు. ఏదో కొంతమంది నేతలు బాబు వెనుక నిలబడుతున్నారు గానీ, మిగిలిన నేతలు ఎవరి పనిలో వారు ఉన్నారు.

ఇక వైసీపీ దాడులకు నిరసనగా చంద్రబాబు దీక్ష కూడా చేస్తున్నారు. ఇక ఇది కూడా ధర్మపోరాట దీక్ష మాదిరిగా హడావిడి ఎక్కువ...ఫలితం తక్కువ అన్నట్లు ఉంది. ప్రజలు అసలు ఏ మాత్రం బాబు దీక్షని పట్టించుకోవడం లేదు. మొత్తానికైతే చంద్రబాబు చేసే రాజకీయానికి...సక్సెస్ రేటు బాగా తగ్గినట్లు ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: