ఏపీ రాజకీయాలు మరీ దారుణంగా తయారైన విషయం తెలిసిందే. అసలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా వాతావరణం మార్చేసి జనాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం చాలా వరకు నష్టపోయింది. ఇక వీరి రాజకీయాలతో ఇంకా నష్టపోయేలా చేస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఘటనలు కక్ష పూరిత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా మారాయి. అయితే ఈ ఘటనలో తప్పు ఎవరిది...ఒప్పు ఎవరిది అనేది జనాలకే బాగా తెలుసు. కానీ తప్పు మీది అంటే మీది అని టి‌డి‌పి, వైసీపీలు మాట్లాడుకుంటున్నాయి.

అయితే ఇక్కడ ఎలాంటి రాజకీయం జరిగినా....ఒక విషయం గమనిస్తే...తప్పు చేయని, ఒప్పు చేయని అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉన్నారు. ఏ విషయాన్నైనా ఐకమత్యంగానే ఎదురుకుంటున్నారు. పట్టాభి...తిట్టింది సజ్జల రామకృష్ణారెడ్డినే అయినా, జగన్‌ని తిట్టారనేది బాగా హైలైట్ చేసేశారు. అలాగే వైసీపీ నేతలు ఎప్పుడు బూతులు మాట్లాడారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక తిడితే దాడులు చేస్తామని డైరక్ట్‌గానే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు.


కింది స్థాయి కార్యకర్త నుంచి....బడా నేత వరకు అంతా ఒకే మాట మీద ఉంటున్నారు. అసలు జగన్ మీద ఈగ వాలనివ్వమనే విధంగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ వైసీపీలో ఉన్న ఐకమత్యం ప్రతిపక్ష టి‌డి‌పిలో లేదని క్లియర్ గా అర్ధమవుతుందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశంలో స్వార్ధం ఉన్న నాయకులు ఎక్కువగానే ఉన్నారని, ఏమన్నా ఇబ్బంది వస్తే తప్పుకునే నాయకులు ఉన్నారని చెబుతున్నారు.


కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి గానీ, అధినేత చంద్రబాబుకి గానీ అండగానే ఉంటారని, కానీ కొందరు నేతలు మాత్రం పరిస్తితి బట్టి హ్యాండ్ ఇచ్చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం టి‌డి‌పిలో ఇంత అలజడి ఉన్నా సరే కొందరు నేతలు అసలు బయటకు రాలేదని, వేరే పార్టీ నేతల వచ్చి టి‌డి‌పి ఆఫీసుపై దాడిని ఖండించారని, కానీ సొంత పార్టీ నేతలు మాత్రం కనిపించలేదని, అలాగే బంద్‌లో లేరని, దీక్షలో లేరని...మొత్తానికైతే సొంత నేతలే బాబుకు దెబ్బవేస్తున్నారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp